Webdunia - Bharat's app for daily news and videos

Install App

Puri Jagannath Birthday: పవన్‌కు నచ్చిన పూరీ జగన్నాథ్.. అందుకే బద్రిని..?

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (12:26 IST)
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు నేడు. 1966 సెప్టెంబర్ 28న తూర్పు గోదావరి జిల్లా నర్సీపట్నంలో జన్మించాడు పూరీ జగన్నాథ్. పూరీకి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. 1989లో ఇండస్ట్రీకి వచ్చిన పూరీ "శివ" సినిమా చూసి మొదటగా రామ్ గోపాల్ దగ్గర శిష్యరికం చేశారు. 
 
అక్కడ దర్శకుడు కృష్ణవంశీ దగ్గర పరిచయం ఏర్పడింది.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పూరీ అందుకున్న పారితోషికం రూ. 1500.. శివ, గులాబీ, నిన్నే పెళ్ళడతా, సింధూరం అనే సినిమాలకి పూరి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే లావణ్య అనే అమ్మాయిని ప్రేమించి ఆ తర్వాత చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు పూరీ. 
 
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం కథతో పవన్‌ని కలిసేందుకు ట్రై చేశాడు పూరీ.. కానీ అక్కడికి వెళ్ళాక బద్రి కథ చెప్పాడు పవన్ కూడా బాగా నచ్చిందట. కానీ క్లైమాక్స్ చేంజ్ చేయాలనీ అన్నాడట పవన్.. కానీ మళ్ళీ అదే క్లైమాక్స్‌తో పూరీ పవన్ కథని చెప్పి ఇంతకి మించిన క్లైమాక్స్ తనకి దొరకడం లేదని నేను మార్చాను అని అన్నాడట.. ఇదే పవన్‌కి బాగా నచ్చి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారట.. అలా 2000 సంవత్సరంలో పూరీ డైరెక్టర్ అయిపోయాడు.
 
పూరీని లైఫ్ ని టర్న్ చేసిన సినిమా పోకిరి.. అప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను చెరిపేసి ట్రెండ్ సెట్ చేసింది ఈ సినిమా.. ఈ సినిమాతో మహేష్ బాబు టాప్ హీరో అయిపోయాడు. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే సినిమాలకి గాను పూరీకి ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డులు లభించాయి. 
 
చిరుత, దేశముదురుతో పూరీ మంచి సక్సెస్ అందుకున్నాడు. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, బిజినెస్ మేన్, ఇద్దరమ్మాయిలతో, టెంపర్, ఇజం.. ఇలా యంగ్ హీరోలందరితోనూ వరుస మూవీస్ తెరకెక్కించాడు పూరీ. తాజాగా లైగర్ సినిమాను తెరకెక్కించారు పూరీ. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా, అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది.  

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments