Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబూ.. మారుతి ఈసారి ఏ కాపీ క‌థ‌తో వ‌స్తున్నావ్ నాయ‌నా..?

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (20:44 IST)
యువ ద‌ర్శ‌కుడు మారుతి ఈరోజుల్లో అనే చిన్న సినిమాతో పెద్ద విజ‌యం సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు. ఆ త‌ర్వాత బ‌స్టాఫ్, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, మ‌హానుభావుడు చిత్రాల‌తో స‌క్స‌స్ సాధించాడు. అయితే... విక్ట‌రీ వెంక‌టేష్‌తో తెర‌కెక్కించిన బాబు.. బంగారం సినిమా... నాగార్జున నిర్ణ‌యం సినిమాని కాపీ కొట్టి తీసాడనే విమర్శలు వచ్చాయి. ఇటీవ‌ల తెర‌కెక్కించిన శైల‌జారెడ్డి అల్లుడు కూడా నాగార్జున అల్ల‌రి అల్లుడు సినిమాకి కాపీనే అంటూ నెటిజన్లు చర్చించుకున్నారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో కెరీర్లో వెన‌క‌బ‌డ్డాడు. 
 
ఇప్పుడు మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో ప్ర‌తిరోజు పండ‌గే అనే సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. ఈసారి స‌క్స‌స్ సాధించేందుకు  వైవిధ్య‌మైన క‌థాంశంతో సాయిధ‌ర‌మ్ తేజ్‌ను స‌రికొత్త‌గా చూపించనున్నాడ‌ట‌. జిఎ 2, యు.వి. పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పైన రూపొంద‌నున్న ఈ సినిమా సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. తేజు స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా న‌టిస్తుంది. తేజు, రాశీ ఖ‌న్నాపై చిత్రీక‌రించిన ముహుర్త‌పు స‌న్నివేశానికి దిల్ రాజు క్లాప్ ఇచ్చారు. 
 
అయితే...ఈసారైనా కొత్త క‌థ‌తో సినిమా తీస్తున్నావా..? లేక పాత క‌థ‌ను తీసుకుని హిట్టు కొట్టాల‌నుకుంటున్నావా..? అంటున్నారు నెటిజ‌న్లు. కాపీ క‌థా..కొత్త క‌థ అనేది తెలియాలంటే ప్ర‌తి రోజు పండ‌గే రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments