Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీని మనిషిగా మారుద్దాం : కొరటాల శివ ట్వీట్

అడ్డంగా విభజించి కాంగ్రెస్ మోసం చేసింది. మీకు న్యాయం చేస్తామంటూ నమ్మించి నరేంద్ర మోడీ పచ్చి మోసం చేశారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలన్న కసితో ఏపీ ప్రజలు రగిలిపోతున్నారు.

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (09:47 IST)
అడ్డంగా విభజించి కాంగ్రెస్ మోసం చేసింది. మీకు న్యాయం చేస్తామంటూ నమ్మించి నరేంద్ర మోడీ పచ్చి మోసం చేశారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలన్న కసితో ఏపీ ప్రజలు రగిలిపోతున్నారు. 
 
అయితే, పలు సందేశాత్మక చిత్రాలు తీసిన దర్శకుడు కొరటాల శివ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన ట్వీట్ ఇపుడు సంచలనంగా మారింది. విభజన హామీల అమలు విషయంలో కేంద్రం చూపిస్తున్న మొండి వైఖరిపై దర్శకుడు కొరటాల శివ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బుధవారం కేంద్రం తేల్చేయడం, తెలంగాణ అడుగుతున్న పలు డిమాండ్లను కూడా తోసిపుచ్చడంపై సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీపై నేరుగా కామెంట్స్ చేశారు. 
 
ఇటీవల విడుదలైన తన సినిమా టీజర్‌లో ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్ చెప్పిన డైలాగ్స్‌ను ప్రధానికి అన్వయిస్తూ తన ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాల్లో ఓ పోస్ట్ పెట్టారు. "ఆంధ్రప్రదేశ్‌కు గతంలో ఇచ్చిన హామీలను మనమంతా కలిసి ప్రధాని నరేంద్ర మోడీకి గుర్తుచేసి.. ఆయనను మనిషిగా మారుద్దాం.. తెలుగు రాష్ట్రాలు భారత్‌లో అంతర్భాగం అని మీరు నిజాయితీగా భావిస్తున్నారా సార్..?" అంటూ మోడీని ఉద్దేశించి కొరటాల శివ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ పెట్టారు.
 
ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాలశివ కాంబినేషన్‌లో భరత్ అనే నేను చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం టీజర్‌ తాజాగా విడుదలైంది. ఇందులో మహేష్ బాబు ఓ డైలాగ్ చెపుతాడు. "చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే.. యు ఆర్ నాట్ కాల్డ్ ఏ మ్యాన్ అని". 
 
ఏపీకి హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పేసిన వెంటనే మోడీపై సోషల్‌మీడియాలో కొరటాల శివ పై డైలాగ్‌ను పోస్టు చేస్తూ తన స్పందన తెలియజేశారు. ఆయన చేసిన పోస్ట్‌ను నెటిజన్లు షేర్ చేసుకుంటున్నారు. సరైన సమయంలో సరైన డైలాగ్‌తో పోస్ట్ పెట్టారంటూ, ఏపీ హక్కుల గురించి ప్రశ్నించారంటూ ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్టిక్ ఐస్ క్రీంలో చనిపోయిన పాము.. ఎంత పెద్ద కళ్ళు..?: ఫోటో వైరల్

తెలంగాణ సింగానికి అదిరిపోయే వీడ్కోలు పలికిన సహచరులు!! (Video)

వలపు వల పేరుతో 36 మందిని బురిడీ కొట్టించిన కిలేడీ!

జడ్జి వద్ద విలపించిన పోసాని... తప్పుడు కేసులతో రాష్ట్రమంతా తిప్పుతున్నారు...

కాంగ్రెస్ పార్టీలో వుంటూ బీజేపీకి పనిచేస్తారా? తాట తీస్తాం.. వారు ఆసియా సింహాలు: రాహుల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments