Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడి రామకృష్ణ బ్లాక్‌బస్టర్ చిత్రాలివే...

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (18:15 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ దర్శకులు కోడి రామకృష్ణ శుక్రవారం చనిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈయన దర్శకుడిగా అనేక మంది హీరోలకు లైఫ్ ఇచ్చారు. ముఖ్యంగా, అనేక నటులను అగ్రహీరోలు చేసిన ఘనత రామకృష్ణకే దక్కుతుంది. 
 
ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన తెలుగులో అగ్రకథానాయకులందరితో సినిమాలు తీశారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ మలయాళ సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు ప్రేక్షకులకు ఆయన అనేక మంచి చిత్రాలను అందించారు.
 
ఆయన వందకుపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో అనేక చిత్రాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయి. అలాంటి చిత్రాల్లో అంకుశం, అరుంధతి, దేవి, పుట్టింటికి రా చెల్లి, మంగమ్మగారి మనవడు, రిక్షావోడు, తలంబ్రాలు, దేవీపుత్రుడు, శ్రీనివాస కళ్యాణం, భారత్ బంద్, ముద్దుల మావయ్య, అమ్మోరు, ఆహుతి, ముక్కుపుడక, ముద్దుల కృష్ణయ్య, దేవుళ్లు, స్టేషన్‌ మాస్టర్‌, చుట్టాలబ్బాయి, బాలగోపాలుడు, సోగ్గాడికాపురం, 20వ శతాబ్దం, పెళ్లాం చెబితే వినాలి, రాజధాని, పోలీస్‌లాకప్‌, గాడ్‌ఫాదర్‌, పెళ్లి, పెళ్లిపందిరి, పెళ్లికానుక, పంజరం, అంజి వంటి అనేక చిత్రాలు ఉన్నాయి.
 
కోడి రామకృష్ణ తన సినీ కెరీర్‌లో పది నంది అవార్డులతో పాటు.. 2 ఫిల్మ్ ఫేర్ పురస్కారలతో పాటు.. 2012లో రఘుపతి వెంకయ్య అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం శత్రువు సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments