Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గుపడుతోంది, కన్నీరు పెడుతోంది

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2022 (13:37 IST)
విజయవాడలో వున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు స్పందించారు. ఆయన ట్విట్టర్లో.. '' తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన పేరుతో ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గుపడుతోంది, కన్నీరు పెడుతోంది.'' అని పేర్కొన్నారు.

 
మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారు, పంచభూతాలున్నాయ్
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడంపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్టీఆర్ అనేది మార్చేయడానికి అదేమీ పేరు మాత్రమే కాదు, ఓ సంస్కృతి, నాగరికత, తెలుగు జాతి వెన్నెముక అన్నారు. ఆనాడు వైస్సార్ విమానాశ్రయం పేరు మారిస్తే ఈరోజు కుమారుడు వచ్చి యూనివర్శిటీ పేరు మార్చారు.

 
ఆ మహనీయుడు పెట్టిన రాజకీయ భిక్షతో బతుకుతున్న నేతలున్నారు... పీతలున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మిమ్మిల్ని మార్చడానికి ప్రజలు వున్నారు, పంచ భూతాలున్నాయి. తస్మాత్ జాగ్రత్త అన్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments