Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్ - పెళ్లి సందడి 2 నుంచి దర్శకేంద్రుడు డ్రాప్ అయ్యాడు

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (14:48 IST)
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పెళ్లిసందడి టైటిల్‌తో సినిమా చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఓం నమో వెంకటేశాయ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని రాఘేవేంద్రరావు చేస్తున్న సినిమా కావడంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది. హీరో ఎవరు అనేది ప్రకటించలేదు. అయితే.. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించనున్నట్టు వార్తలు వచ్చాయి.
 
ఈ వార్తలు వాస్తవమే అని తేలింది. పెళ్లిసందడి సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించనున్నట్టు అఫిషియల్‌గా ప్రకటించారు. అయితే... రాఘవేంద్రరావు షాక్ ఇచ్చారని చెప్పచ్చు. అదేంటి అంటే... ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారు.
 
మరి... డైరెక్షన్ ఎవరు చేయనున్నారంటే... గౌరీ రోనకి అప్పగించారు. ఇది యూత్‌ఫుల్ సినిమా. అందులోనూ ప్రేమ‌, పెళ్లి క‌థ‌. అందుకే.. ఈ సినిమాకి దర్శకత్వం వహించే బాధ్యత యువ‌త‌రానికే అప్పగించాలని డిసైడ్ అయ్యారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. దీనికి స్వరవాణి కీరవాణి సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments