Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ మీద పోటీ కోసం కాదు.. రామ్‌తో పోటీ కాదు : హరీశ్ శంకర్

వరుణ్
సోమవారం, 29 జులై 2024 (12:44 IST)
మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కలయికలో వస్తోన్న చిత్రం 'మిస్టర్ బచ్చన్'. మాస్ కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఆదివారం ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. హీరోయిన్ భాగ్యశ్రీతో పాటు దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్, రామ్ పోతినేనిల 'డబుల్ ఇస్మార్ట్'కు పోటీగా 'మిస్టర్ బచ్చన్' వేస్తున్నారా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా హరీష్ శంకర్ బదులుగా సమాధానమిచ్చారు. 
 
'పూరి జగన్నాథ్‌తో నన్ను ఎప్పుడు పోల్చుకోను. అయన ఓక లెజెండరీ డైరెక్టర్. ఆయనతో ఎప్పుడు పోటీ పడను. ఓటీటీ సంస్థల ఒత్తిడి వలన అనుకున్న డేట్ కంటే కొద్దిగా ముందుకురావడంతో అనుకోకుండా డేట్ క్లాష్ అవుతోంది. ముందుగా 'డబుల్ ఇస్మార్ట్' డేట్ వేశారు. కానీ మాకు ఫైనాన్షియాల్ కారణాల వలన అదే డేట్‌కు వస్తున్నాం. ఒక్క సినిమా క్లాష్ వలన పూరికి నాకు మాటలువుండవ్ అని నేను అనుకోను. అయనా అనుకోరు. 
 
ఆగస్టు 15న రిలీజ్ చేయమని సలహా ఇచ్చింది మైత్రీమూవీస్ శశి. పూరి మీద పోటీ కోసం కాదు, రామ్‌తో పోటీ కాదు, నా తర్వాత సినిమా రామ్‌తో చేయబోతున్నాను అలాంటప్పుడు క్లాష్‌కు ఎందుకు వెళ్తాను, మేము తప్పక రావాల్సివస్తుంది. అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. "మిస్టర్ బచ్చన్", "డబుల్ ఇస్మార్ట్" రెండు బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్ఆర్ఆర్‌ను చంపేందుకు స్కెచ్ .. ఆ పెద్దలు ఎవరో తెలాలి?: రాజేంద్ర ప్రసాద్ (Video)

ప్చ్.. నా పోస్టులు.. నా సినిమాలు ఒక్క ఓటరును ప్రభావితం చేయలేదు : ఆర్జీవీ (Video)

స్వయంగా కారు నడుపుతూ కనిపించిన కేసీఆర్.. బీఆర్ఎస్ వర్గాల్లో ఖుషీ (video)

తెలంగాణలో చలి: కొమరం భీమ్ జిల్లాలో వణికిపోతున్న జనం

భువనేశ్వర్‌: నాలుగేళ్ల బాలికను.. రూ.40వేలకు అమ్మేశారు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments