Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూరీ జగన్నాథ్ గతిని రామ్ పోతినేని మార్చనున్నాడా?

Advertiesment
Ram,   Puri

డీవీ

, మంగళవారం, 18 జూన్ 2024 (13:51 IST)
Ram, Puri
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్ పై విమర్శలు జల్లలు కురిశాయి. ఆ సినిమాలో హీరోకు నత్తి అనేది పెట్టి కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టినా కథలో కొత్తదనం లేకపోవడంతో అది డిజాస్టర్ గా నిలిచింది. కొంతకాలం గేప్ తీసుకున్న పూరీ ఇప్పుడు రామ్ పోతినేనితో ఇస్మార్ట్ సీక్వల్ డబుల్ ఇస్మార్ట్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పూర్తి ఆశలు పెట్టుకున్నాడు పూరీ. 
 
ఈ సినిమా విడుదలలో కూడా కొంత గందరగోళం నెలకొంది. ఈ ఏడాది మార్చిలోనే సినిమా విడుదల చేస్తున్నట్లు డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత పుష్ప సీక్వెల్  ఆగస్టు లో చేయాలనుకున్నారు. అదే ఆగస్టు  15 న రామ్ చిత్రం వస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీంతో కొంత చర్చోపచర్చలు ఇరు నిర్మాతల మధ్య జరగడంతోపాటు పుష్ప సీక్వెల్ టెక్నికల్ అంశాలు కలిసిరాకపోవడంతో డిసెంబర్ కు వాయిదా డేసినట్లు ప్రకటించారు.
 
ఇప్పుడు రామ్ కు ఆగస్టు కలిసి వచ్చిందనే చెప్పాలి.  ఇక పెద్ద సినిమాలు కూడా ఏమీ లేకపోవడంతో విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రభాస్ కల్కి సినిమా రెండు నెలల ముందు విడుదల కావడం వల్ల తమ సినిమాకు ఎటువంటి అడ్డంకి వుండదని పూరీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఇక పూరీకి ఇస్మార్ట్ అనేది సవాల్ లాంటిది. ఈ సినిమా సక్సెస్ తోనే మరలా తన కెరీర్ పుంజుకుంటుందా? లేక రామ్ గోపాల్ వర్మలా కెరీర్ వెనకడుగు పడుతుందా? అనేది త్వరలో తేలనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల వెంకన్నను దర్శించుకున్న త్రివిక్రమ్.. పవన్ కోసమేనా? (Video)