Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిఫ‌రెంట్ స్పై థ్రిల్ల‌ర్ - గ్రే-షూటింగ్ పూర్తి

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (10:01 IST)
Pratap Potain, Arvind Krishna and others
ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతున్న చిత్రం `గ్రే`. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌ మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కిర‌ణ్ క‌ల్లాకురి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ద స్పై హూ ల‌వ్డ్ మి అనే ట్యాగ్‌లైన్ తో తెర‌కెక్కుతోన్నఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్లో గుమ్మ‌డికాయ కొట్టారు చిత్ర యూనిట్‌. త్వ‌ర‌లోనే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభంకానున్నాయి.
 
చిత్ర ద‌ర్శ‌కుడు రాజ్ మ‌దిరాజ్ మాట్లాడుతూ, అద్వితీయ మూవీస్ ప్రై.లి పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతున్న `గ్రే` మూవీ షూటింగ్ ఈ రోజు పూర్త‌య్యింది. ఇదొక స్టైలిష్‌ స్పై థ్రిల్లర్ మూవీ. ట్విస్టులు ట‌ర్నుల‌తో ఆధ్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా ఉంటుంది. ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ అన్ని పాత్ర‌ల‌కి మంచి ప్రాధాన్య‌త ఉంటుంది. 20రోజుల పాటు నిర్విరామంగా హైద‌రాబాద్‌లోని ప‌లు అంద‌మైన లొకేష‌న్స్ లో షూటింగ్ జ‌రిపాం. నిర్మాత కిర‌ణ్‌గారు పూర్తి స‌హ‌కారం అందించారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభంకానున్నాయి. ఔట్‌పుట్ ప‌ట్ల మా టీమ్ అంద‌రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. త‌ప్ప‌కుండా ఒక డిఫ‌రెంట్ మూవీ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు.

సంబంధిత వార్తలు

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

వెలుగు చూడాల్సిన జగన్ జల్సా ప్యాలెస్ రహస్యాలు చాలా ఉన్నాయ్... : మంత్రి నారా లోకేశ్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments