Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రపంచంలోని ఎత్తైన స్థాయిలో అల్లు అర్జున్ కూతురు అర్హ పుట్టిన రోజు

Advertiesment
ప్రపంచంలోని ఎత్తైన స్థాయిలో అల్లు అర్జున్ కూతురు అర్హ పుట్టిన రోజు
, సోమవారం, 22 నవంబరు 2021 (08:59 IST)
Allu Arjun, Arha
ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా యజమానులు ఎమ్మార్ ప్రాపర్టీస్ ఈ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు అతని కుటుంబ సభ్యులకు ఆతిథ్యం ఇచ్చారు. అల్లు అర్జున్ కూతురు #AlluArha పుట్టిన రోజు వేడుకలు ప్రపంచంలోనే ఎత్తైన స్థాయిలో జరిగాయి. అలా జరిగిన మొదటి పుట్టినరోజు వేడుక ఇదే. ప్రైవేట్ అంతస్తులో పబ్లిక్ యాక్సెస్ లేదు. ఇప్పటి వరకు ఈ స్థాయిలో పుట్టినరోజు పార్టీ ఏదీ నిర్వహించలేదు. అలా జరిగిన మొదటి పుట్టిన రోజు అర్హది మాత్రమే.
 
webdunia
Allu Arjun family at Burj Khalifa
ఆదివారంనాడు జ‌రిగిన ఈ వేడుల‌కు సంబంధించిన ఫొటోల‌ను అల్లు అర్జున్ పోస్ట్ చేశాడు. అద్భుత‌మైన ప్ర‌దేశంలో అంత‌కంటే అద్భుత‌మైన మా ఆర్హ పుట్టిన‌రోజ జ‌రుపుకోవ‌డం చాలా థ్రిల్ క‌లిగించింద‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా అభిమానులు అల్లు అర్జున్ కుటుంబానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ పోస్ట్ చేశారు. సినిమారంగంలోని ప్ర‌ముఖులంతా నెంబ‌ర్ 1 స్థాయిలో చేశావ‌ని ఆనందం వ్య‌క్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌నాడు కోస‌మే 27 కిలోల బరువు త‌గ్గా - ఫంక్ష‌న్‌లో ఎమోష‌న‌ల్ కావ‌డానికి కార‌ణం అదే -శింబు