ముద్దు పెట్టలేదు.. అంతే ఒకమ్మాయి నన్ను రిజక్ట్ చేసింది.. అక్షయ్ కుమార్

Webdunia
బుధవారం, 20 జనవరి 2021 (19:24 IST)
బాలీవుడ్‌లో సక్సెస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్న అక్షయ్ కుమార్ ప్రస్తుతం రూ.135 కోట్లకు పైగా పారితోషికం పుచ్చుకుంటున్నారు. హౌస్ఫుల్-4 ప్రమోషన్లో భాగంగా ఇటీవల కపిల్ శర్మ షోకు హాజరయ్యారు అక్షయ్. ఈ సందర్భంగా తన ఫస్ట్ లవ్ రిజెక్షన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మొదట్లో తాను ఓ అమ్మాయిని ఇష్టపడ్డానని.. తనతో కలిసి మూడు నాలుగు సార్లు డేట్‍కు వెళ్లాను. 
 
అంటే.. తనతో కలిసి సినిమాకు వెళ్లి అట్నుంచి అటే రెస్టారెంట్కి వెళ్లి భోంచేసే వాళ్లం. అయితే.. నా ప్రధాన సమస్య ఏంటంటే నాకు చాలా సిగ్గు. అందువల్ల తనతో బయటకు వెళ్లినప్పుడు ఆమె భుజం మీద చేతులు వేయడం తన చేతిని పట్టుకొని నడవడం.. కిస్ చేయడం వంటివి చేయలేదు. దాంతో ఆమె నన్ను రిజెక్ట్ చేసింది'' అన్నారు అక్షయ్. దీంతో అందరూ పగలబడి నవ్వేశారు.
 
ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ''మీరు ప్రపోజ్ చేయాలని ఆ అమ్మాయి భావించి ఉంటుంది. కానీ.. మీరేమో ముద్దు పెట్టలేదు కాబట్టే వదిలేసింది అంటున్నారు. బహుశా మీరే తప్పులో కాలేసిట్లున్నారు'' అని అంటున్నారు. ''అయినా.. మీకు ట్వింకిల్ లాంటి అందమైన భార్య లభించాలని రాసి పెట్టి ఉంది కాబట్టే.. ఆమె మిమ్మల్ని రిజెక్ట్ చేసింది'' అంటూ కామెంట్ చేస్తున్నారు.
 
ఇదిలాఉంటే.. అక్షయ్-ట్వింకిల్ ఖన్నా వివాహ బంధానికి 20 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేశాడు అక్షయ్.  ఈ పోస్టుకు నెటిజన్ల శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments