Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ఠాగూర్
సోమవారం, 20 మే 2024 (15:32 IST)
బెంగుళూరులోని రేవ్ పార్టీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇందులో అనేక మంది తెలుగు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్టు తేలింది. ఇలాంటి వారిలో సినీ నటి హేమ, యాంకర్ శ్యామల్ కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై నటి హేమ స్పందించారు. తాను బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొనలేదని, హైదరాబాద్ నగరంలోని ఓ ఫామ్‌‍హౌస్‌లో ఉన్నట్టు బుకాయించారు. 
 
కానీ, ఆమె రేవ్ పార్టీ జరిగిన ప్రదేశంలోనే ఉన్నట్టు కన్నడ మీడియాకు హేమ ఫోటో లభించింది. ఆమె ధరించిన దుస్తుల్లోనే తాను బెంగుళూరు రేవ్ పార్టీలో లేనంటూ విడుదల చేసిన వీడియోలో కనిపించారు. దీంతో ఆమె బెంగుళూరు రేవ్ పార్టీలో ఉన్నట్టు తేలింది. 
 
అయితే, ఉదయం తాను హైదరాబాదులోనే ఉన్నానంటూ.. ‌బెంగుళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని బుకాయిస్తూ వీడియో విడుదల చేశారు. కానీ సదరు వీడియో సైతం బెంగుళూరు ఫామ్ హౌస్‌లోనే ఓ పక్కకి వెళ్లి  హేమ రికార్డ్  చేసినట్లుగా తెలుస్తుంది. హేమతో పాటు ఆమె స్నేహితుడు చిరంజీవి‌ని అరెస్టు చేసిన పోలీసులు తెలిపారు. 
 
రేవ్ పార్టీలో మొత్తం 100 మంది సభ్యులు, అందులో70 మంది అబ్బాయిలు, 30 మంది అమ్మాయిలు ఉన్నారు. వారి రక్త నమూనాలను హెయిర్ శాంపిల్స్‌ను సేకరిస్తున్న పోలీసులు వెల్లడించారు. మరో రెండు గంటల్లో అసలు నిజాలను బెంగుళూరు పోలీసులు వెల్లడిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం - రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదు

ఏబీసీడీలు నేర్పించేందుకు నెలకు రూ.21 వేలా?

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్ రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments