Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వీయ అనుభ‌వాలే న‌వ‌దీప్ 2.O ల‌వ్, మౌళి గా సిద్దమవుతుంది

Advertiesment
Navadeep, Pankhuri Gidwani

డీవీ

, శనివారం, 11 మే 2024 (10:45 IST)
Navadeep, Pankhuri Gidwani
సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్  సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్ గా  2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్,మౌళి.  ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్‌ కంటెంట్‌లో అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి. ఈ విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్  మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో క‌లిసి  నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన  సి స్పేస్  భాధ్యతలు తీసుకుంది. 
 
ఇటీవల సింగిల్‌ కట్‌ లేకుండా సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సెన్సారు వారు 'ఏ' సర్టిఫికెట్‌ను అందజేశారు. కాగా నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ 7న  విడుద‌ల చేస్తున్నట్లు ప్ర‌క‌టించింది చిత్ర‌యూనిట్‌. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ఈ చిత్రంలోచాలా డిఫ‌రెంట్‌గా  నవదీప్ కనిపించడంతో ఈ సినిమా న‌వ‌దీప్ 2.Oగా  అభిమానులంతాఒక ఢిఫరెంట్ కాన్నెప్ట్ తొ వుంటుంద‌ని మంచి అంచ‌నాల‌తో ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. 
 
సినిమా ప్రమోషన్‌ కంటెంట్‌  చూస్తుంటే వీరి  అంచ‌నాల‌ను మ‌రింత పెంచే విధంగా వుంది.  ఎందుకుంటే  న‌వ‌దీప్‌ను స‌రికొత్త‌గా  చూసిన వాళ్లంతా ఈసినిమాతో ఆయ‌న కొత్త ట్రెండ్ క్రియేట్ చెయ్య‌బోతున్నాడ‌ని అంటున్నారు. నా లైఫ్ లో జ‌రిగిన  ప్రేమ‌క‌థ‌ల‌కు ఫ‌లిత‌మే ఈ సినిమా క‌థ‌. నేను పాన్ ఇండియా లెవ‌ల్‌లో ప్రేమించేవాడ్ని. ప్రేమ అనే టాపిక్‌లో సో మెనీ వెరియేష‌న్స్ వున్నాయి. నా స్వీయ అనుభ‌వాలే  ఈ సినిమా క‌థ, జూన్‌ 7న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. విభిన్న ప్రేమ‌క‌థ‌లు కోరుకునే ప్రేక్ష‌కులంద‌రికి మా ల‌వ్‌, మౌళి మ‌న‌సుల‌కు హ‌త్తుకుంటుంది. అన్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవ్విస్తూ, భయపెట్టిన ఓ మంచి ఘోస్ట్ (OMG) టీజర్