Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక‌దీపం హీరోను బెదిరించింది ఎవ‌రో తెలుసా!

Webdunia
బుధవారం, 19 మే 2021 (13:46 IST)
kartika deepam
బుల్లితెర‌లో కార్తీక దీపం సీరియ‌ల్ మంచి రేటింగ్‌లో వుంది. ఎన్నో ఏళ్ళుగా ఆ సీరియ‌ల్ ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ఆ సీరియ‌ల్‌లో హీరో పేరు కార్తీక్‌. అస‌లు పేరు నిర‌ప‌మ్‌. త‌ను సీనియ‌ర్ న‌టుడు ఓంకార్ త‌న‌యుడు. కార్తీక‌దీపం సీరియ‌ల్ ప‌రిమిత న‌టీన‌టుల‌తోనే కొన‌సాగుతుంది. ఇందులో కార్తీక్‌ను భార్య వుంటుంది. అత‌న్నే ప్రేమించే మ‌రో అమ్మాయి కూడా వుంటుంది. వీరిద్ద‌రి ప్రేమాయణం మ‌రోవైపు సాగుతుంది. కానీ, పెల్లిచేసుకున్న అమ్మాయిని కార్తీక్ చాలా ఇబ్బందులు పెడ‌తాడు. అది సీరియ‌ల్‌లో చూసే మ‌హిళ‌లుకానీ, ప్రేక్ష‌కులుకానీ చాలా బాధ‌ప‌డుతుంటారు. త‌మకే ఇంత అన్యాయం జ‌రుగుతున్నంద‌గా ఫీల‌యి కార్తీక్‌కు తిట్టుకున్న సంద‌ర్భాలున్నాయి. 
 
కానీ అంత‌కుమించి కొంద‌రు కార్తీక్ ఫోన్‌చేసి వార్నింగ్ కూడా ఇచ్చార‌ట‌. ఈ విష‌యాన్ని కార్తీక్ పాత్ర‌ధారి అనుప‌మ్ ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశాడు. కార్తీక‌దీపం సీరియ‌ల్ ప్ర‌తి ఇంటిలో భాగ‌మైపోయింది. నేను చేసిన పాత్ర‌కు భార్య‌కు అన్యాయం చేస్తున్నాన‌ని కొంద‌రు భావించి ఆమెను స‌రిగ్గా చూసుకోమ‌ని వార్నింగ్ కూడా ఇచ్చారు. అదెలా అంటే, మీకు చెప్పుల‌దండ వేస్తాం. మీరు క‌న‌బ‌డితే కొడ‌తాం అని వారు ఫోన్ చేసి మ‌రీ బెదిరించారు. అలా అన‌డంతో అనుప‌మ్‌కు ముందు భ‌య‌మేసింది. త‌ర్వాత తేరుకుని ఇంత‌లా వారిని ఈ సీరియ‌ల్ క‌నెక్ట్ అయిందంటే వారు చెప్పిన దాంట్లో నిజం వుంద‌ని అర్థం చేసుకున్నాడు. అందుకే ఈ సీరియ‌ల్ అయ్యేవ‌ర‌కు బ‌య‌ట ఎక్క‌డ తిర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడ‌ట‌. ఇక ఈ సీరియ‌ల్‌కు త్వ‌ర‌లో ముగింపు ఇవ్వ‌నున్న‌ట్లు చెబుతున్నాడు. మ‌రి హీరో విల‌న్‌లా భార్య‌ను హింసిస్తే ఇలానేవుంటుంది అనేది అర్థం అయింద‌ట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments