Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

`పీన‌ట్ డైమండ్` టీజర్ విడుదల చేసిన దిల్ రాజు (video)

`పీన‌ట్ డైమండ్` టీజర్ విడుదల చేసిన దిల్ రాజు (video)
, శనివారం, 20 మార్చి 2021 (16:53 IST)
Dil Raju, Peanut Diamond, teaser
అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌  ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా తెరకెక్కుతున్న చిత్రం `పీన‌ట్ డైమండ్`. ఈ చిత్రానికి వెంక‌టేష్ త్రిప‌ర్ణ క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అందిస్తున్నారు. `బెంగాల్ టైగ‌ర్`ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా  జె. ప్ర‌భాక‌ర రెడ్డి ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఒకేసారి రెండు టైం లైన్స్లో జరిగే కథగా తెరకెక్కుతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ని డైనమిక్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేశారు.. 
 
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ, టైటిల్ చాలా వెరైటీ గా ఉంది. సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామా వస్తున్న ఈ సినిమా టీజర్ నేను రిలీజ్ చాలా ఆనందంగా ఉంది.. టీజర్ చూశాను. ఎంతో ఆసక్తికరంగా ఉంది. సినిమా కూడా అంతే బాగుంటుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు. ఈ సినిమా కూడా మంచి డిఫరెంట్ కంటెంట్ తో రాబోతుంది. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నాను. వెంక‌టేష్ త్రిప‌ర్ణ  రాసిన డైలాగ్స్ బాగున్నాయి.. దర్శకత్వం గురించి చెప్పనవసరం లేదు. ఆ షాట్స్ చూస్తుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.  నిర్మాతలు అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ ఈ సినిమా కి ఎంత ఖర్చు పెట్టారో ఆ సినిమా క్వాలిటీని చూస్తుంటేనే తెలుస్తుంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అన్నారు.. 
 
ఫైట్స్‌: శ‌ంక‌ర్‌.యు, లైన్ ప్రొడ్యూస‌ర్‌: శ్రీ‌నిధి న‌క్కా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : శాని సాల్మాన్‌‌,
పి.ఆర్‌.ఓ: సాయి స‌తీష్‌, నిర్మాత‌లు : అభిన‌వ్ స‌ర్ధార్‌,వెంక‌టేష్ త్రిప‌ర్ణ, క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: వెంక‌టేష్ త్రిప‌ర్ణ.
 
టీజ‌ర్ ఎలా వుందంటే!
అదొక అంద‌మైన అడ‌వి, సెల‌యేల్లు జ‌ల‌జ‌ల‌పారుతున్న ప్రాంతం. ఓ చిన్న పాప‌, తాత‌య్య అత‌ను విజ‌యం సాధిస్తాడా! అని అడిగే ప్ర‌‌శ్న‌తో టీజ‌ర్ మొద‌లువుతంది. అత‌ని గ‌మ్యం విజ‌య‌మా, మ‌ర‌ణ‌మా అతని ఎంచుకునే మార్గాల‌పై ఆధార‌ప‌డి వుంటుంది. అని తాత‌య్య బ‌దులిస్తాడు. 
 
అత‌ని  గురించి పూర్తిగా చెప్ప‌తాత‌య్యా\! అని పాప అన‌డంతో,  అత‌ని జీవితాన్ని మ‌లుపు తిప్పే రెండు సంఘ‌ట‌న‌లు ఒకేరోజు చోటుచేసుకున్నాయి. ఒక‌వైపు ఓ యువ‌కుడు త‌న ప్రేయ‌సికి రింగ్ ఇస్తూ ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తుంటాడు. మ‌రోవైపు ఆ చుట్టు ప్ర‌క‌ల ్ర‌గామాల ప్ర‌జ‌లు వ‌జ్రాల వేట‌కు బ‌య‌లుదేరితే, అన‌గానే.. సుమ‌న్ అటువైపు హుందాగా రావ‌డం, అక్క‌డి ప్ర‌జ‌లు ప‌రుగెత్త‌డం క‌నిపిస్తుంది. 
ఇక అంద‌రూ ఇలావుంటే అత‌ని అడుగు వేరేవైపుకు మ‌ళ్ళాయి. అన‌గానే గెడ్డంతో హుందాగా కోటువేసుకుని వున్న హీరో క‌నిపిస్తాడు.  ఇదంతా చెబుతున్న తాత‌..ఎంతో జ్ఞానం వున్నా అసుర ల‌క్ష‌ణాలు కలిగి ఉండ‌డం వ‌ల్ల అత‌ని జీవితంలో తీవ్ర‌ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. అని తాత‌.. వాయిస్ వ‌స్తుంది.
 
ఎవ‌రికైనా విలువైన వ‌జ్రం దొరికితే అమ్మి సొమ్ముచేసుకుంటారు. లేదా వాడుకుంటారు. కానీ ఆయ‌న అంద‌రిలా ఆలోచించ‌లేదు. కానీ ఆస‌మ‌యంలో ఆయ‌న‌కు వ‌చ్చిన ఆలోచ‌న ఒక చ‌రిత్ర సృష్టించ‌బోతోంది.. అన‌గానే.. శుభ‌లేఖ సుధాక‌ర్ ఆవేశంగా రావ‌డం.. ఆ త‌ర్వాత యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో.. ఎంతో ఆస‌క్తిక‌రంగా వుంది. అత‌నిలో వ‌చ్చిన ఆలోచ‌న ఏమిటి? అనేది సినిమాలో ప్ర‌ధాన‌మైన అంశంగా టీజ‌ర్ చెబుతోంది. చివ‌ర‌గా పీన‌ట్ డైమండ్ అంటూ టైటిల్ ప‌డుతుంది. శెన‌గ‌గింజంత డైమండ్ వారి జీవితాల్లో ఏం చేసింద‌నేది టీజ‌ర్ సారాంశంగా క‌నిపిస్తుంది.  సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా సాగింది. ఇద్ద‌రు వ్య‌క్తుల జీవితాల్లో ఒకే స‌మ‌యంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌లా టీజ‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయ‌న పేరు విన‌గానే చాలా థ్రిల్ ఫీల‌య్యాః మిషా నారంగ్