Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్న బిడ్డకు అన్నీ తానై... రూ. 10 లక్షలతో వెండి ఊయల

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (21:41 IST)
కన్నడ నటుడు హీరో అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జ కేవలం 35 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. చిరంజీవి చనిపోయే సమయానికి అతడి భార్య మేఘన రాజ్ గర్భవతి. 

ఈ మధ్య కుటుంబ సభ్యులు ఆమెకు సీమంతం కూడా చేసారు. "నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వు బతికే ఉంటావు. నువ్వు నాలోనే ఉన్నావు. ఐ లవ్ యు’’ అంటూ తాజాగా మేఘన రాజ్ విడుదల చేసిన ఓ వీడియో ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. తన దృష్టిలో చిరంజీవి అంటే ఏంటో చెప్పడానికి ఈ విశ్వంలోని పదాలన్నీ సరిపోవని భావేద్వేగానికి గురయ్యారు మేఘన.
 
‘‘నువ్వు నన్ను ఎంతగానో ప్రేమిస్తావు. అందుకే, నువ్వు నన్ను ఒంటరిగా వదిలిపెట్టవు. అవునా? నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మన ప్రేమకు గుర్తుగా నువ్వు నాకు ఇచ్చిన అపురూపమైన బహుమతి. ఈ తీయని అద్భుతాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను. నిన్ను మన బిడ్డగా మళ్లీ ఈ భూమిపైకి తీసుకురావడానికి, నిన్ను మళ్లీ ఎత్తుకోవడానికి, నీ చిరునవ్వును మళ్లీ చూడటానికి, నీ నవ్వును మళ్లీ వినడానికి వేచి చూస్తున్నాను’’ అని ఆ సందేశంలో మేఘన పేర్కున్నారు.
ఆమె కోరిక ఇప్పుడు నెరవేరింది. చిరంజీవి మళ్లీ బిడ్డగా మేఘన ఒడికి చేరారు. ఈ క్రమంలోనే చిరంజీవి తమ్ముడు ధృవ సర్జా తన సోదరుడి బిడ్డకు 10 లక్షలు విలువగల వెండి ఉయ్యాలను కొన్నాడు. ఈ వెండి ఉయ్యాలను తన వదిన మేఘనకు బహుమతిగా ఇచ్చాడు. ఈ ఉయ్యాలతో ధృవ ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మేఘనా రాజ్ గురువారం మగ బిడ్డకు జన్మను ఇచ్చింది.
 
తమ అన్నయ్యే మళ్లీ పుట్టాడు అంటూ ఇప్పటికే ధృవ బాగా ఎమోషనల్ అవుతున్నాడు. చిరంజీవి చనిపోయిన తర్వాత వదిన మేఘనా రాజ్‌కు అన్నీ తానే అయి చూసుకుంటున్నాడు ధృవ. జూన్ 7న చిరంజీవి సర్జా కన్నుమూసినప్పుడు అతను ఆమె పక్కనే ఉండిపోయాడు. అన్నయ్య లేకపోయినా కూడా మేఘనను తల్లిలా చూసుకుంటున్నాడు ధృవ.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం