Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

చిత్రాసేన్
మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (17:26 IST)
Dhanush, Nithya Menon
వెర్సటైల్ హీరో ధనుష్‌ ఎప్పుడూ వినూత్నమైన కథలతో అద్భుతమైన నటనతో అలరిస్తుంటారు. ప్రత్యేకమైన కథల ఎంపికతో డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పా పాండి’, ‘రాయన్’ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన ఆయన, ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ వంటి యూత్‌ఫుల్ ఫీల్‌గుడ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన తర్వాత, ఇప్పుడు తన డైరెక్షన్ లో నాలుగో సినిమాగా ఇడ్లీ కొట్టుతో వస్తున్నారు.
 
147 నిమిషాల పర్ఫెక్ట్ రన్ టైం తో ఈ చిత్రానికి యూ సర్టిఫికేట్ లభించింది. గత సినిమాలకంటే భిన్నంగా, ఇడ్లీ కొట్టు గ్రామీణ వాతావరణంలో సాగే, భావోద్వేగాలు కథ. ట్రైలర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ వాల్యూస్, ఎమోషనల్‌ లేయర్లతో ధనుష్‌ స్టోరీటెల్లింగ్‌ అదిరిపోయింది.
 
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఎస్విఎం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రామారావు చింతలపల్లి గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌, ప్రమోషన్లు అద్భుతమైన రెస్పాన్స్‌ అందుకున్నాయి. సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
 
అలాగే ధనుష్‌, నిత్యా మీనన్‌ జంట మరోసారి రీయూనియన్‌ అవ్వడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి కెమిస్ట్రీ తిరు చిత్రంలో  ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. మరోసారి అలరించడానికి సిద్ధం కావడంతో ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
 
అద్భుతమైన ప్రీ రిలీజ్ రిపోర్ట్స్‌తో రేపటి నుండి థియేటర్లలో రిలీజవుతున్న ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కోసం గెట్ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ సీఎం స్టాలిన్.. ఒక్క కరూర్‌లోనే ఎందుకు జరిగింది? హీరో విజయ్ ప్రశ్న (Video)

Woman: ఆమె వయస్సు 19 సంవత్సరాలే.. భర్తతో గర్భా ఆడుతూ కుప్పకూలిపోయింది.. (video)

woman: భార్యాభర్తలు తప్పతాగారు.. కొట్టుకున్నారు.. గొంతులో కత్తితో పొడిచేసింది..

వామ్మో... రెస్టారెంట్లోకి దూసుకు వచ్చిన చిరుతపులి (video)

ఐదేళ్ల కుమార్తెను కాటేసిన తండ్రి... మరణించేంత వరకు జైలుశిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments