Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Advertiesment
Nithya Menon,  Vijay Sethupathi

దేవీ

, శుక్రవారం, 18 జులై 2025 (09:45 IST)
Nithya Menon, Vijay Sethupathi
వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, వెరీ ట్యాలెంటెడ్ నిత్యా మేనన్‌ జంటగా నటిస్తున్న రోమ్ కామ్ ఫ్యామిలీ డ్రామా ‘సార్‌ మేడమ్‌’. "A Rugged Love Story" అనేది ట్యాగ్ లైన్‌. పాండిరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్ పై సెందిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విదిదలైన ‘సార్‌ మేడమ్‌’ టీజర్‌ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
 
ఈ రోజు మేకర్స్ ‘సార్‌ మేడమ్‌’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ''నాతో వస్తే లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచించకుండా నేనే కావాలని వచ్చేశావు. మా అమ్మానాన్నే నన్ను ఇలా చూసుకోలేదని వాళ్ళే తిట్టుకునే విధంగా నిన్ను చూసుకుంటా' అని విజయ్ సేతుపతి డైలాగ్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
 
విజయ్ సేతుపతి, నిత్యామీనన్ మధ్య వచ్చే గొడవలు చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. పెళ్లి చూపులు, పెళ్లి లాంటి బ్యూటిఫుల్ ఎమోషన్స్ తో మొదలైన ట్రైలర్ 'మమ్మల్నిద్దర్నీ విడదీసేయండి' అని నిత్యామీనన్ చెప్పిన డైలాగ్ తో ఊహించని మలుపు తీసుకోవడం ఇంట్రెస్టింగ్గా ఉంది.
 
పరోటా మాస్టర్ గా విజయ్ సేతుపతి కనిపించిన సీన్స్ నవ్వులు పూయించాయి. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మాస్ యాక్షన్ కూడా ఉండడం మరింత క్యూరియాసిటీ పెంచింది.
 
విజయ్ సేతుపతి మరోసారి తన సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. విజయ్ సేతుపతి, నిత్యామీనన్ కెమిస్ట్రీ స్పెషల్ హైలట్ గా నిలిచింది.  
 
డైరెక్టర్ పాండిరాజ్‌ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అందించారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ ఫన్, ఎమోషన్ ని మరింతగా ఎలివేట్ చేసింది. డిఓపి ఎం సుకుమార్ అందించిన విజువల్స్ బ్యూటీఫుల్ గా వున్నాయి.
 
ఫ్యామిలీ ఎమోషన్, ఫన్, రగ్గడ్ లవ్ స్టొరీ, మాస్ యాక్షన్ తో ‘సార్‌ మేడమ్‌’ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.
ఈ సినిమా జూలై 25న థియేటర్లో విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ