ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో త్రిభాషా చిత్రం ప్రారంభం

Webdunia
సోమవారం, 28 నవంబరు 2022 (14:39 IST)
Dhanush, Shekhar Kammula, Sunil Narang, Puskur Ram Mohan Rao
కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ దేశంలోని అత్యుత్తమ నటులలో ఒకరు. కెరీర్‌ లో బెస్ట్ ఫేజ్‌ ని ఎంజాయ్ చేస్తున్న ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్, తన తొలి సినిమాతోనే నేషనల్ అవార్డ్ గెలుచుకుని, కళాత్మక విలువలతో కమర్షియల్ విజయాలని అందుకొని, పాత్ బ్రేకింగ్ చిత్రాలను తెరకెక్కించడంలో మాస్టర్ అయిన టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో జతకట్టారు.
 
 ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌ లో రూపొందుతున్న క్రేజీయస్ట్ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకుని, విడుదల కానుంది. నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ గ్రూప్ యూనిట్) నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు.
 
సోనాలి నారంగ్ సమర్పణలో ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేయనున్నారు. ప్రాజెక్ట్ కి సంబధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

శ్రీవారి ప్రసాదం ధర పెంపు? క్లారిటీ ఇచ్చిన తితిదే చైర్మన్

ఇన్‌స్టాగ్రాంలో ఎవడితో చాటింగ్ చేస్తున్నావ్, భర్త టార్చర్: వివాహిత ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments