Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కె.సీఆర్., జగన్ కు సెటైర్ మూవీగా రామన్న రాబోతునుదా ?

Advertiesment
sekar kammula with ramanna team
, బుధవారం, 23 నవంబరు 2022 (16:19 IST)
sekar kammula with ramanna team
ఇప్పుడు పొలిటికల్ ఫిలిమ్స్ అన్నీ ఇదొక రాజకీయ పార్టీకో నాయకుడికో తగిలేట్లుగా సినిమా తీస్తుంటారు. వారు కూడా లైట్గా తీసుకుంటారు. గతంలో శేఖర్ కమ్ముల లీడర్ అనే సినిమా తీసాడు. ఆ సినిమా వై. ఎస్. కు టచ్ చేసే కథగా ఉంది. కోట్లా రూపాయలు అక్రంగా బీరువాలు, బెడ్ లో పెట్టేసి సీన్ ఇప్పటికే ఎవరు గ్రీన్. ఆ సినిమా చూసాక కామన్ మాన్ ఎవరిని ఉదేసించి తీసిందో అర్థం చేసుకున్నారు. తాజాగా అలాంటి పొలిటికల్ కథ రాబోతుంది. 
 
"జార్జ్ రెడ్డి" చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నవీన్బే తిగంటి. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "రామన్న యూత్". ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజినీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రొమోషన్కు శేఖర్ కమ్ములను పిలిచారు. 
 
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ....."రామన్న యూత్ ట్రైలర్ బాగుంది.  నాయకుడి వెంట తిరిగి తమకో లైఫ్ ఉంటుందనే వారికి తాము నిర్లక్ష్యం చేయబడితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది చిత్ర కథాంశంగా తెలుస్తోంది. నాయకుల కోసం జెండాలు ఎత్తిన వారు ఏమవుతారు అనేది మంచి పాయింట్. ఇక్కడే నవీన్ సక్సెస్ అయ్యాడు. ఇది మనం చూసిన ఒక ఊరి కథ. కొత్త కొత్త ఆలోచనలతో యంగ్  టాలెంట్ ఇండస్ట్రీలోకి రావాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. నేనూ ఇలా చిన్న చిన్న చిత్రాలతోనే ప్రయాణం ప్రారంభించాను. మంచి సినిమా చేసేందుకు టీమ్ అంతా కష్టపడినట్లు తెలుస్తోంది. సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రవితేజ, శ్రీలీల ధమాకా ప్రమోషన్ కు తంటాలు