Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూపర్ స్టార్ కృష్ణ 'దేవుడు లాంటి మనిషి'... పుస్తకం విడుదల

''పురాణాల్లో ఉత్తమ విలువలున్న శ్రీరాముడిలా తెలుగు సినిమాలో ఉత్తమ విలువలున్న వ్యక్తి సూపర్‌స్టార్‌ కృష్ణగారు. ఆయన తన విలువలతో సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. రాముడెంత గొప్పవాడు కృష్ణగారు కూడా అంతే గొప్ప. ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నిషియన

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2016 (20:44 IST)
''పురాణాల్లో ఉత్తమ విలువలున్న శ్రీరాముడిలా తెలుగు సినిమాలో ఉత్తమ విలువలున్న వ్యక్తి సూపర్‌స్టార్‌ కృష్ణగారు. ఆయన తన విలువలతో సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. రాముడెంత గొప్పవాడు కృష్ణగారు కూడా అంతే గొప్ప. ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు, ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌ను పరిచయం చేశారని'' దర్శకుడు కె. రాఘవేంద్రరావు తెలిపారు.
 
సూపర్‌స్టార్‌ కృష్ణ 50 నట వసంతాలను పూర్తిచేసుకున్న సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులు వినాయకరావు కృష్ణ నట జీవితంపై, కృష్ణ నటించిన 365 చిత్రాలు గురించి రాసిన 'దేవుడు లాంటి మనిషి' పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడారు. శనివారం హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌లో జరిగింది. కె.రాఘవేంద్రరావు పుస్తకావిష్కరణ చేసి తొలి ప్రతిని కృష్ణ, విజయనిర్మల దంపతులకు అందించారు.
 
అనంతరం కృష్ణ మాట్లాడుతూ... వినాయకరావు నాపై పుస్తకం రాస్తానంటే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తావని అడిగాను. ఒక సంవత్సరంలో పూర్తి చేస్తానని అన్నారు. కానీ ఒక సంవత్సరం తర్వాత నన్ను కలుసుకుని సమాచార సేకరణ ఇంకా సమయం పడుతుందని చెప్పి, 'అల్లూరి సీతారామరాజు' సినిమా మేకింగ్‌పై ఆయన రాసిన బుక్‌లెట్‌ను విడుదల చేశారు. మూడు సంత్సరాలు పాటు వినాయరావు బాగా కష్టపడి, చాలామందిని కలిసి, ఫోటోలు సేకరించి ఈ పుస్తకాన్ని రాసినందుకు అభినందిస్తున్నాను. 
 
నేను నటుడిగా 50 నట వసంతాలను పూర్తిచేసుకున్నానంటే అందుకు కారణం నా దర్శకులు, నిర్మాతలు, నా తోటి నటీనటులు, టెక్నిషియన్సే కారణం. రాఘవేంద్రరావుగారు డైరెక్ట్‌ చేసిన వజ్రాయుధం, అగ్నిపర్వతం.. వంటి సినిమాలతో నాకు మాస్‌ ఇమేజ్‌ను తెచ్చిపెట్టారు. అలాగే కోదండరామిరెడ్డిగారితో చేసిన సినిమాలన్నీ వందరోజులు ఆడాయి. బి.గోపాల్‌ సహా అందరూ నాతో మంచి సినిమాలు చేశారు. నన్ను హీరోగా పరిచయం చేసిన ఆదుర్తి సుబ్బావుగారికి, 'గూఢచారి 116'తో మాస్‌ ఇమేజ్‌ తెచ్చి పెట్టిన డూండిగారి తలచుకోకుండా వుండలేనని' అన్నారు.
 
విజయనిర్మల వ్యాఖ్యానిస్తూ... బాపుగారు 'సాక్షి' సినిమా చేసి కృష్ణగారిని నాకు అప్పగించారు. బాపుగారి స్పూర్తితోనే నేను దర్శకురాలిగా మారాను. ఈ పుస్తకం కోసం మూడేళ్ల పాటు ఎంతో కష్టపడి ముందుకు తెచ్చిన వినాయకరావుగారిని అభినందిస్తున్నానని' అన్నారు.
 
టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ... సినిమా పరిశ్రమలో ఎంతోమంది ఉన్నా కొంతమంది పేరు మాత్రమే మనకు వినడుతుంది. అటువంటి వారిలో కృష్ణ ఒకరు. మానవత్వం మూర్తీభవించిన వ్యక్తి ఆయన. ఆయన నటించిన 365 సినిమాలపై వినాయకరావు మూడేళ్ల పాటు కష్టపడి రచించినందుకు అభినందలు తెలియజేస్తున్నానన్నారు.
 
రచయిత వినాయకరావు మాట్లాడుతూ... తెలుగు సినిమాను సుసంపన్నం చేసిన గొప్ప వ్యక్తుల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఓ జర్నలిస్ట్‌గా నాపై ఉందని భావించి పుస్తకాలు రాస్తున్నాను. ఇప్పటివరకు నేను 9 పుస్తకాలు రచించాను. సూపర్‌స్టార్‌ కృష్ణగారిపై ఈ పుస్తకం రెడీ కావడానికి మూడేళ్ల సమయం పట్టింది. ఈ జర్నీలో నాకు సహకరించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
 
ఈ కార్యక్రమం టి.సుబ్బరామిరెడ్డి అధ్యక్షతన లలితకళా పరిషత్‌వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోయిన సుబ్బారావు, పి.చంద్రశేఖర్‌, కె.యస్‌.రామారావు, ఎస్‌.వి.కష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, బోసుబాబు, బి.గోపాల్‌, సి.కల్యాణ్‌, ఎన్‌.రామలింగేశ్వరరావు, కోటి, అనీల్‌ సుంకర, మాధవరావు, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ శ్రీనివాసరావు, ఆర్‌.కె.గౌడ్‌, శాఖమూరి మల్లిఖార్జునరావు, జి.వి.ప్రసాద్‌, దాసరి కిరణ్‌కుమార్‌, మహేందర్‌ రెడ్డి,  సూపర్‌హిట్‌ పత్రికాధినేత బి.ఎ.రాజు, ముప్పలనేని శివ, జర్నలిస్ట్‌ ప్రభు, రసమయి రాము, ఆశాలత తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మహేందర్‌రెడ్డి రెండు లక్షల యాభై వేల రూపాయలను చెల్లించి మొదటి పుస్తకాన్ని కోనుగోలు చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

పుష్ప 2 చూసి యువకులు చెడిపోతున్నారు, రేవతి భర్తకు 25 లక్షల చెక్కు: మంత్రి కోమటిరెడ్డి

Pawan Kalyan: ఓట్ల కోసం పనిచేయట్లేదు- ప్రజా సంక్షేమమే లక్ష్యం.. పవన్ కల్యాణ్

BRS : స్విస్ బ్యాంకుకే బీఆర్ఎస్ రుణాలు ఇవ్వగలదు.. రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments