Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రావణి చనిపోవడానికి కారణం నేను కాదు.. సాయి.. దేవరాజు రెడ్డి

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (20:29 IST)
'మనసు మమత, మౌనరాగం' బుల్లితెర సీరియల్ నటి శ్రావణి బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు ప్రియుడు దేవరాజు అలియాస్ దేవరాజు రెడ్డి కారణమనే ఆరోపణలు వచ్చాయి. హైదరాబాదులోని మధురానగర్‌లో జరిగిన ఈ ఆత్మహత్య కేసు కలకలం రేపింది. 
 
దీంతో దేవరాజు ఓ ఆడియో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఘటనలో తనకెలాంటి సంబంధం లేదని శ్రావణి స్నేహితుడు దేవరాజు రెడ్డి స్పష్టం చేశాడు. ఆమె ఆత్మహత్యకు తాను కారణం కాదని, ఆమె కుటుంబసభ్యులతో పాటు సాయి అనే వ్యక్తి ఈ ఆత్మహత్యకు కారకుడని ఆరోపించాడు. 
 
శ్రావణితో తనకు ఏడాది కిందటే పరిచయం అయిందని, కానీ సాయి అనే వ్యక్తితో ఆమెకు ఐదేళ్లుగా పరిచయం ఉందని దేవరాజు రెడ్డి వెల్లడించాడు. వాళ్ల ఇంట్లోవాళ్లు, సాయి అనే వ్యక్తి.. వారంతా శ్రావణిని హింసించి, కొట్టడం కారణంగా.. అవమానం తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. 
 
శ్రావణి ఆత్మహత్య చేసుకునే ముందు తనకు ఫోన్ చేసిందని, అందువల్లే ఈ విషయం తనకు తెలిసిందని చెప్పుకొచ్చాడు. ఇక ఆ ఇంట్లో ఉండలేనని చెప్పిందన్నాడు. రెండ్రోజుల కిందట తాను, శ్రావణి రెస్టారెంట్ కు వెళితే అక్కడికి సాయి వచ్చాడని, ఆమెపై చేయి చేసుకున్నాడని తెలిపాడు. 
 
అంతేకాకుండా, 'ఐ లవ్ యూ దేవ, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నువ్వు రమ్మంటే నీ వద్దకు వచ్చేస్తాను, నువ్వు వద్దన్నా, నీపై నాకెలాంటి కోపం లేదు, నా పని నేను చూసుకుంటాను, మూడు రోజులు షూటింగ్ ఉంది.. ఇదే నాకు అవకాశం, నువ్వు రమ్మంటే నావద్ద ఉన్న గోల్డ్, క్యాష్ తీసుకుని వచ్చేస్తాను' అని శ్రావణి తనతో చెప్పిందని దేవరాజ్ పేర్కొన్నాడు. 
 
సాయి అనే వ్యక్తి రోడ్డుపై జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టాడని శ్రావణి చెప్పిందని దేవరాజ్ తెలిపాడు. చాలా అవమానంగా ఉందని, వాళ్ల మొహాలు ఇక చూడదలచుకోలేదని చెప్పిందని, తన చావుకు కారణం సాయి అనే వ్యక్తని చెప్పి చనిపోయిందని దేవరాజ్ వెల్లడించాడు. 
 
పైగా, సాయి అనే వ్యక్తి శ్రావణిని తన ముందే చంపాలని చూశాడని, సాయిని పెళ్లి చేసుకోవాలని శ్రావణిపై ఒత్తిడి తెచ్చాడని, పెళ్లి చేసుకోకపోతే చంపేస్తాడనే భయంతో శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజు వెల్లడించాడు. శ్రావణి కాల్ రికార్డింగ్ క్లిప్స్‌ పోలీసుల ముందుంచుతానని, తల్లిదండ్రుల ఒత్తిడితోనే శ్రావణి తనపై కేసు పెట్టిందని దేవరాజ్ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.4600 కోట్ల వ్యయంతో ఏపీతో పాటు నాలుగు సెమీకండక్టర్ తయారీ యూనిట్లు

జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఓవర్.. ఏం జరిగినా జగన్ బెంగళూరులోనే వుంటే ఎలా?

Amaravati: అమరావతిలో 74 ప్రాజెక్టులు- సీఆర్డీఏ భవనం ఆగస్టు 15న ప్రారంభం

సుప్రీం ఆదేశంతో వణికిపోయిన వీధి కుక్క, వచ్చేస్తున్నానంటూ ట్రైన్ ఎక్కేసింది: ట్విట్టర్‌లో Dogesh (video)

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments