నిజ జీవిత నాయ‌కుడు.. వెండితెర క‌థానాయ‌కుడు ‘రంగా’

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (19:45 IST)
అది ‘అల వైకుంఠపురం’ కాదు… విజయవాడ మహానగరం. పైగా అది రాజకీయాల రాజధాని. అక్కడంతా ‘సరిలేరు నాకెవ్వరూ‘ అనుకునేవారే. అలాంటి రాజధాని కంట్లో నిజ‌జీవిత నాయ‌కుడు ‘రంగా’ అనే నలుసు పడింది. నలిపేయడానికి అది సాధ్యమయ్యేది కాదు. కన్ను వాచిపోవడం తప్ప అదెక్కడికీ పోదు. పక్కలో బల్లెంలా తయారయ్యే సరికి శత్రువులూ ఎక్కువయ్యారు. 
 
రోట్లో తల పెట్టాక రోకటి పోటుకు భయపడే రకం కాదు నిజ‌జీవిత నాయ‌కుడు ‘రంగా’. అక్కడి రాజకీయానికి బలుపు ఎక్కువయ్యింది… మలుపులూ ఎక్కువయ్యాయి. ఓ పక్క కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయం, మరోపక్క తెలుగుదేశంలో ప్రత్యర్థి ‘దేవినేని’ చాణక్యం. ఆ పద్మవ్యూహంలో అభిమన్యుడే అయ్యాడు రంగా. ఆ రోజే డిసెంబర్ 26. అక్కడి రౌడీయిజంలో రంగా అనే నిజం లేకుండా పోయింది.
 
అసలు రంగా ఎవరు? ఈ దేవినేని ఎవరు? ఈ ఇద్దరూ ప్రత్యర్థులా? మిత్రులా? వీరి మధ్య ఏం జరిగింది. అది తెలుసుకోవాలంటే ‘దేవినేని’ చూడాల్సిందే.. ఇందులో దేవినేనిగా నందమూరి తారకరత్న, రంగా పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్నారు.
 
శివనాగేశ్వర్రావు (శివనాగు) దర్శకత్వంలో ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రామూరాథోడ్, జి.ఎస్.ఆర్.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ పాటను అమలాపురంలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో సినిమా మొత్తం పూర్తవుతుంది. 
 
చిత్ర దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. ఈ డిసెంబర్ 26 రంగా వర్ధంతి. మా సినిమా చిత్రీకరణ కూడా ఈరోజే మొదలైంది. రేపటితో పూర్తవుతుంది. ముఖ్యంగా రంగా పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. సురేష్ కొండేటిని ఈ సినిమా నుండి రంగా సురేష్ అంటారేమో.. త్వ‌ర‌లో రిలీజ్ ఎప్పుడు అనేది తెలియ‌చేస్తామ‌న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

MeeSeva services: విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీసేవా సేవలు

నదులను అనుసంధానం చేస్తాం .. కరవు రహిత ఏపీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments