Webdunia - Bharat's app for daily news and videos

Install App

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

దేవీ
మంగళవారం, 22 జులై 2025 (12:15 IST)
Raashi Khanna's entry
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ కి వస్తుండగా ఓజీ చిత్రంతో పాటు మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా కొనసాగుతుంది. ఈ సినిమాలో శ్రీలీల నాయిక. కాగా, మరో హీరోయిన్ రాశీ ఖన్నా కూడా నటిస్తుంది. ఈమె ఈరోజే తమ యూనిట్ లోకి ఆహ్వానిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది.  దేవదూత  రాశిఖన్నాను శ్లోకా గా ఎంట్రీ ఇస్తున్నట్లు కాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లో షూటింగ్ జరుగుతోంది.
 
ఈ చిత్రానికి గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. ఇప్పటికే హరీష్ శంకర్ గురించి పవన్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. నేను ప్లాప్ లో వున్నప్పుడు నాకు హరీష్ గబ్బర్ సింగ్ తో హిట్ ఇచ్చాడు అన్నారు. ఇక దానికి సీక్వెల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు తాజాగా దేశభక్తి ఇమిడి వున్న కథతో ఉస్తాద్‌ భగత్‌సింగ్ రాబోతోంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా బోస్ ఉజ్వల్ కులకర్ణి పనిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'దృశ్యం' మూవీ మర్డర్ సీన్ రిపీట్ - ప్రియుడు మోజులో భర్తను హత్య చేసి నడి ఇంటిలోనే పాతిపెట్టిన భార్య!

ఉపరాష్ట్రపతి జగ్దీష్ ధన్కర్ రాజీనామా వెనుక?

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. టేకాఫ్ నిలిపివేత

Air Hostess - థానే: ఎయిర్ హోస్టెస్‌పై పైలట్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి?

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments