Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Advertiesment
Pawn kalyan- Hariharveelali prerelease

దేవీ

, సోమవారం, 21 జులై 2025 (22:19 IST)
Pawn kalyan- Hariharveelali prerelease
హరిహరవీరమల్లు సినిమా ప్రీరిలీజ్ వేడుక ఈరోజు హైదరాబాద్ లో శిల్పకళావేదిక ఆడిటోరియంలో జరిగింది. కర్నాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ కండ్రే హాజరై, పవన్ అంటే పవర్ అంటూ ఆయన్ను చూడగానే కొత్త ఎనర్జీ వస్తుందని చెప్పారు. అనంతరం పవన్ మాట్లాడుతూ, మంచి స్నేహితుడయిన ఈశ్వర్ కండ్రే నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు.
 
ఇంకా పవన్ మాట్లాడుతూ, రెండేళ్ళనాడు భీమ్లానాయక్ సమయంలో అందరి సినిమాలు వంద రూపాయలుంటే, పవన్ సినిమా 10, 20 వుండేవి.   పవన్ కళ్యాణ్ ఎప్పుడూ రికార్డ్ గురించి చేయలేదు. బ్రహ్మానందంగారు చెప్పినట్లు నేను సగటు మనిషిగా బతుకుదామనుకున్నా. ఈరోజు నా అభిమానుల గురించే మాట్లాడతాను. నేను కిందపడ్డా, లేచినా, వున్నా అన్నా.. మీవెంట వున్నామని అభిమానులున్నారు.

నా దగ్గర గూండాలు లేరు. గుండెల్లో మీ అభిమానం వుంది. 30 సంవత్సరాలక్రితం సినిమారంగానికి వచ్చాను. వయసుపెరిగినా గుండెల్లో ధైర్యం వుంది. గబ్బర్ సింగ్ టైంలో ఇదే వేడుకమీద మహబూబ్ నగర్ అభిమాని.. అన్నా.. నువ్వు ఒక్క హిట్  ఇవ్వన్నా..అన్నారు.అప్పుడే దేవుడ్ని కోరుకున్నా.. అలా  హరీష్ శంకర్ ద్వాారా  వచ్చింది.
 
వరుసగా హిట్లు కొట్టినా ఒక్క ప్లాప్ అయితే. సినిమారంగంలోనేను గ్రహించాను. కారల్ మార్క్ చెప్పినట్లు అన్ని బంధాలు ఆర్థిక బంధాలే. హిట్లు ప్లాప్స్  కంటే అభిమానులనే నమ్మాను. డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వను. బంధాలకే ప్రాధాన్యం ఇచ్చా. హరిహరవీరమల్లు సినిమా చాలా కష్టాల్లో చేశా. నాకు ప్రధాని నుంచి అందరూ తెలుసు. కానీ డబ్బులు రావు. అందుకే సినిమా ద్వారా మిమ్మల్ని రంజిపచేయాలి అనుకున్నా. 
 
నేను అపజయాల్తో వుంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి రీమేక్ లు చేస్తున్న నాకు జల్సా సినిమా ఇచ్చాడు. నాకు సమాజ బాధ్యత పిచ్చి. అలాంటి నాకు ఎ.ఎం. రత్నం గారు వచ్చి ఈ సినిమా చేయాలని అన్నారు. దీనికి ఫౌండేషన్ దర్శకు క్రిష్ వల్లే వచ్చింది. కానీ ఆయన వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు.
 
నాకు నిరుత్సాహంగా వున్నప్పుడు కీరవాణి సంగీతంతో మళ్ళీ ఎనర్జీ వచ్చేది. హరిహరవీరమల్లు బలంగా వుందంటే కారవాణి గారే కారణం. అందరూ ఓజీ ఓజీ అంటూన్నారు. అది నా సినిమాగదా.. ముందుగా వీరమల్లు  గురించి మాట్లాడుకుందాం. మనోజ్ పరమహంస అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. మంగళగిరిలో సెట్ వేసి షూట్ చేశాం. బాబిడియోల్ ను ధర్మేంద్ర గారి సినిమా షూట్ లో చూసేవాడిని. ఇందులో ఔరంగజేబ్ పాత్ర చేశాడు. 
 
ఈరోజు టికెట్ రేట్లు పెరిగి, ప్రబుత్వం మనది వచ్చాక.. దాని తాలూకా సత్తా చూస్తారు. ఇక హరిహరవీరమల్లు నా కిష్టమైన కథ. భారత్ దేశం ఎవరిమీద దాడిచేయలేదు. కానీ మన దేశాన్ని అందరూ దాడి చేశారు. పాఠ్యపుస్తకాల్లో మొగల్ తాలూకా అరాచకాలను చెప్పలేదు. అక్బర్, ఔరంగ జేబ్ గ్రేట్ అన్నారు. హిందూవుగా వుంటే టాక్స్ కట్టాలని క్రూరుడు ఔరంగజేబ్.. అలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ లాంటి వాడు వచ్చాడు. హరిహర.. కల్పిత పాత్రలో సగటు మనిషి ఏంచేశాడనేది కథ. ఒకప్పుడు విజయవాడ దగ్గర కొల్లూరు లో కోహినూర్ వజ్రం దొరికింది. అది లండన్ లో వుంది. క్రిష్ కథ చెప్పినప్పుడు నచ్చింది. అందుకే బెస్ట్ ఎఫెట్ పెట్టాను.
 
రియల్ లైఫ్ గూండాలు, రౌడీలను ఎదుర్కొన్నాను కానీ. సినిమాపరంగా  రెండు నెలలుపాటు మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ నేర్చుకున్నాను. అన్నీ క్రోడీకరించి 18 నిముషాలపాటు నేనే యాక్షన్ కొరియోగ్రఫీ చేశాను. నేను ఫ్లాప్ లో పెరిగా. సక్సెస్ లో కాదు. అందుకే ఈ సినిమా సక్సెస్ అవ్వాలని పెరుమాల్ళకు కోరుకుంటున్నా. అందుకే మీరే నా బలం. నేను కష్టాల్లో వున్నా. అన్నా మీకు మేమున్నామని ముందుకు వచ్చారు. ప్రతి ఒక్కరికీ పేరుపోయినా... ఈ గుండె మీ కష్టాలను తీర్చాలని కోరుకుంటుంది. జై భారత్ జైహింద్ అంటూ ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?