పర్ఫెట్టి వాన్ మెల్లీ వేదిక నుండి దిగ్గజపు, ఉల్లాసకరమైన కన్ఫెక్షనరి బ్రాండ్స్‌లో ఒకటి చుపా చుప్స్, తమ సిగ్నేచర్ తియ్యని-పుల్లని రుచి యొక్క విచిత్రమైన ప్రభావాన్ని సజీవంగా తెచ్చిన సరికొత్త కాంపైన్ ను విడుదల చేసింది. పునరుత్తేజం కలిగించే కొత్త TVCతో, తీపి, పులుపుల కలయిక సాధారణ జీవితాన్ని ఏవిధంగా పూర్తిగా వినోదంగా మార్చగలదు అని ఆలోచనతో ఈ కాంపైన్ రూపొందించబడింది.
రోజూవారీ క్షణాల్లో వినోదం కలిగించే బ్రాండ్ ఉద్దేశ్యంతో రూపొందించబడిన కాంపైన్ చుపా చుప్స్ స్వీట్-సోర్ (తియ్యని-పుల్లని) జెల్లీలు ఊహ మరియు ఆలోచన యొక్క ఉల్లాసకరమైన ప్రభావాన్ని ఏవిధంగా కలిగిస్తాయో ప్రదర్శించడం ద్వారా ఈ కాంపైన్ ఒక ఉత్సాహవంతమైన మలుపు తిరుగుతుంది. సాధారణమైన రుచితో, ఈ ఫిల్మ్ తీపి, పులుపు కలిసినప్పుడు అనూహ్యమైన విషయాల వైపు మళ్లుతుంది, ఆలోచన పూర్తిగా అదృశ్యమవుతుంది.
కొంతమంది స్నేహితుల సమూహం క్యారమ్స్ ఆడుతున్న సాధారణ సెట్టింగ్‌లో TVC ప్రారంభమైంది. అయితే వారు చుపా చుప్స్ బెల్ట్స్‌ను కొరకడం ప్రారంభించిన క్షణమే, ఈ ప్రసిద్ధి చెందిన ఆట ఊహించలేనంత ఉల్లాసకరంగా మారిపోయింది. కాంపైన్ గురించి మాట్లాడుతూ, అనురాగ్ అగ్నిహోత్రి, ఛీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, వెస్ట్ ఇలా అన్నారు, “చుపా చుప్స్‌తో సాధారణ క్షణాలను కూడా వినోదం నిండిన క్షణాలుగా ఏవిధంగా మార్చవచ్చో ఈ ఫిల్మ్ చూపించింది. అమాయకపు క్యారమ్స్ మ్యాచ్ వివిధ స్టైల్స్ ను సృష్టించడం, నియమాలను ఉల్లంఘించిన వినోదం, గందరగోళాల అల్లరిగా మారిపోయిన ప్రపంచాన్ని మేము ఊహించాము. చుపా చుప్స్ బెల్ట్స్ యొక్క రుచి అనుభవానికి మేము ప్రాధాన్యతనిచ్చాము. ఎందుకంటే తియ్యని, పుల్లని కలయిక ఉన్నప్పుడు, వినోదం తప్పనిసరిగా ఉంటుంది. అందులోనే మేజిక్ ఉంది.”