Webdunia - Bharat's app for daily news and videos

Install App

"దేవదాస్" మూవీ ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే...

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ "దేవదాస్". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న హీ

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (09:15 IST)
టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ "దేవదాస్". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటించగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రీమియర్ షోలను అమెరికాతో పాటు పలు దేశాల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ మూవీకి ఓవర్సీస్‌లో కొన్ని చోట్ల మంచి టాక్ సొంతం చేసుకుంటే... మరికొన్ని చోట్ల అబౌ యావరేజ్‌ టాక్‌తో సరిపెట్టుకునట్టు వార్తలు వస్తున్నాయి.
 
ఈ చిత్రంలో నాగార్జున, నానిల నటన పెద్ద ఎస్సెట్‌ అని చెబుతున్నారు. మరోవైపు ఈ మూవీలో నాని తన నటనతో నాగార్జునను డామినేట్ చేసాడనే టాక్ వినబడుతుంది. మూవీ రెండో అర్థభాగంలో నాని కామెడీ ఈ మూవీని నిలబెట్టిందని ప్రేక్షకులు చెబుతున్నారు. హీరోలుగా నాగ్, నానిల కామెడీ ముందు వెన్నెల కిషోర్ తేలిపోయాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
 
హీరోయిన్స్‌గా నటించిన రష్మిక మండన, ఆకాంక్ష సింగ్ ఉన్నంతలో ఫర్వాలేదనిపించారు. వైజయంతి మూవీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. దర్శకుడిగా శ్రీరామ్ ఆదిత్య మంచి మార్కులే కొట్టేశారు. మొత్తానికి నాగార్జున, నానిల నుంచి ఆడియన్స్ కోరుకునే ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నయని ప్రీమియర్ షోలు తిలకించిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments