Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు నష్టం దావా కేసు : హీరో నాగార్జున వాంగ్మూలం నమోదుకు కోర్టు ఆదేశం

ఠాగూర్
సోమవారం, 7 అక్టోబరు 2024 (14:29 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు నాగార్జున వేసిన క్రిమినల్‌ పరువునష్టం దావాపై హైదరాబాద్ నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. నాగార్జున తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అంశంలో మంగళవారం నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు పేర్కొంది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
 
"మా కుటుంబంపై మంత్రి సురేఖ రాజకీయ దురుద్దేశంతో నిరాధార వ్యాఖ్యలు చేశారు. వాటివల్ల మా కుటుంబంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. నిజానిజాలు తెలుసుకోకుండా పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలి" అని నాగార్జున గత గురువారం నాంపల్లి కోర్టులో క్రిమినల్‌ పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. 
 
కాగా, అక్కినేని నాగ చైతన్య, సమంతల విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కారణమంటూ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్!!

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

Pawan Kalyan: తమిళనాడులో జనసేన ఏర్పాటు.. స్టాలిన్‌ను కొనియాడిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం