Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఓ 'ఫుట్‌బాల్' వంటివారు : ప్రకాష్ రాజ్ (Video)

ఠాగూర్
సోమవారం, 7 అక్టోబరు 2024 (13:55 IST)
రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ ఫుట్‌బాల్ వంటివారని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ఆయన తమిళ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌ పేరును ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలు తనకేం అర్థం కావడం లేదంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, ఆయన ఓ ఫుట్‌బాల్ వంటివారన్నారు. ఫుట్ ఆటను చూసేందుకు మైదానానికి వెళితే ఒకటి ప్రేక్షుడుగా ఉండాలి. లేదా ఏదో ఒక జట్టులో ఉండాలి. 
 
అలాకాకుంటే అంపైర్ లేదా ఎక్స్‌ట్రా ఆటగాడిగా ఉండాలి. కానీ, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఫుట్‌బాల్‌గా ఉన్నాడు. అందువల్ల ఆయన్ను ప్రతి ఒక్కరూ తంతారు... తన్ని తరిమేస్తారు. పవన్ చెప్పినట్టు హిందూ ధర్మం ప్రమాదంలో లేదన్నారు. ప్రమాదంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. పెరియార్ ఎక్కడ బీజేపీ ఎక్కడ, చెగువేరా ఎక్కడ బీజేపీ ఎక్కడ, గద్దర్ ఎక్కడ బీజేపీ ఎక్కడ. నటుడిగా వివిధ చిత్రాల్లో వేర్వేరు పాత్రలు వేయొచ్చు. కానీ రాజకీయాల్లో  అలా కాదు. ఓ స్థిరమైన ఆలోచనతో ముందుకు సాగాలి. అపుడే నిలదొక్కుకోగలరు" అంటూ వ్యాఖ్యానించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిత్రుడు నరేంద్ర మోడీకి తేరుకోలేని షాకిచ్చిన డోనాల్డ్ ట్రంప్

Nara Lokesh: న్యూ స్కిల్ డెవలప్‌మెంట్ పోర్టల్ ప్రారంభించనున్న ఏపీ సర్కారు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments