Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్ వివాహానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?

బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ- టీమిండియా కెప్టెన్ కోహ్లీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగిన బాలీవుడ్ సెలబ్రిటీల జంట దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్

Webdunia
శుక్రవారం, 22 జూన్ 2018 (11:41 IST)
బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ- టీమిండియా కెప్టెన్ కోహ్లీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో గత కొంతకాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగిన బాలీవుడ్ సెలబ్రిటీల జంట దీపికా పదుకునే, రణ్‌వీర్ సింగ్ వివాహానికి రంగం సిద్ధమైంది. వీరిద్దరికి నవంబర్ 10వ తేదీన వివాహం జరుగనుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
 
అయినా బిటౌన్ అంతా నవంబర్ పదో తేదీన దీపికా, రణ్‌వీర్ వివాహం జరుగనుందని కోడైకూస్తోంది. అలాగే ఉదయ్‌పూర్‌లోని విలాసవంతమైన ప్యాలెస్‌లో వివాహ వేడుకను నిర్వహించాలని రెండు కుటుంబాలు భావిస్తున్నాయి. 
 
ఈ విషయంలో దీపికా పదుకునే ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. చేతిలో వున్న సినిమాలను సాధ్యమైనంత వరకు త్వరగా పూర్తి చేసి.. వివాహానికి సిద్ధం కావాలని దీపిక, రణవీర్ సింగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి చారిత్రాత్మక చిత్రాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!

మార్క్ శంకర్ పవనోవిచ్‌ను కాపాడిన వారిని సత్కరించిన సింగపూర్

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments