Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిపీటలెక్కనున్న మరో బాలీవుడ్ ప్రేమజంట

బాలీవుడ్‌కు చెందిన మరో ప్రేమజంట పెళ్లిపీటలెక్కనుంది. ఇటలీలో పెళ్లి చేసుకుని ముంబైలో రిసెప్షన్ పెట్టుకోవాలని ఆ ప్రేమపక్షులు భావిస్తున్నారు. ఆ లవ్ బర్డ్స్ ఎవరో కాదు.. దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్.

Webdunia
శనివారం, 28 జులై 2018 (12:04 IST)
బాలీవుడ్‌కు చెందిన మరో ప్రేమజంట పెళ్లిపీటలెక్కనుంది. ఇటలీలో పెళ్లి చేసుకుని ముంబైలో రిసెప్షన్ పెట్టుకోవాలని ఆ ప్రేమపక్షులు భావిస్తున్నారు. ఆ లవ్ బర్డ్స్ ఎవరో కాదు.. దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్.
 
బాలీవుడ్ హీరోయిన్లు అనుష్క శ‌ర్మ‌, సోన‌మ్ క‌పూర్‌లు ఇలాగే త‌మ‌కి న‌చ్చిన వారిని ప్రేమ వివాహం చేసుకోగా, ప్రియాంక చోప్రా అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోన‌స్‌తో త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌నుంది. ఇక దీపిక‌-ర‌ణ్‌వీర్‌లు కూడా ఇదే విధంగా పెళ్లిపీటలెక్కనున్నారు. 
 
వీరిద్దరి వివాహం న‌వంబ‌ర్ 10వ తేదీన ఉత్త‌ర ఇట‌లీలోని లంబార్టీ అనే ప్ర‌దేశంలో అబ్బుర‌ప‌ర‌చే ప్ర‌కృతి అందాల మ‌ధ్య వీరి వివాహం జ‌ర‌ుగ‌నున్నట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. స‌ర‌స్సు చుట్టూ ఉన్న వ‌స‌తులు, లాడ్జిలు, విల్లాలు ఇప్ప‌టికే బుక్ చేసినట్టు సమాచారం. 
 
డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోనున్న ఈ జంట ముంబైలో రిసెప్ష‌న్ ప్లాన్ చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. పంజాబీ సాంప్రదాయ ప్రకారం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనే రోకా సెర్మనీ ఇప్పటికే జరిగిపోయింది. త్వ‌ర‌లో నిశ్చితార్ధంతో పాటు పెళ్లి తంతు కూడా ముగించేయ‌నున్నారని అంటున్నారు. 
 
పెళ్లి తర్వాత తాము కలిసి ఉండబోయే ఇంటిని కూడా వీళ్లు ఇప్పటికే ఎంపిక చేసుకున్నారట. ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఇంటికి దగ్గరే ఓ రెండు అంతస్తుల బిల్డింగ్‌ను రణ్‌వీర్ కొన్నాడు. ఈ ఇంటిని తమ అభిరుచికి తగినట్లు ఈ జంట మార్పులు చేసుకుంటున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments