Webdunia - Bharat's app for daily news and videos

Install App

"రాజా సాబ్" అప్డేట్ వచ్చేసింది.. గ్లింప్స్‌ విడుదల ఎప్పుడంటే?

డీవీ
ఆదివారం, 28 జులై 2024 (19:04 IST)
Raja Saab first glimpse
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ "రాజా సాబ్" నుంచి రెబల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఫ్యాన్ ఇండియా గ్లింప్స్‌ను రేపు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
 
"రాజా సాబ్" సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో "రాజా సాబ్" సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది.
 
"రాజా సాబ్" సినిమా ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ రేపు సాయంత్రం 5.03 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఈ గ్లింప్స్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో వింటేజ్ కారు ముందు ప్రభాస్ పింక్ సూట్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. 
 
"రాజా సాబ్" సినిమాలో ప్రభాస్ లుక్, మేకోవర్ చాలా కొత్తగా ఉండబోతోంది. డార్లింగ్ ఫ్యాన్స్  ప్రభాస్ ను ఎలా స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారో, డైరెక్టర్ మారుతి అలా "రాజా సాబ్" మూవీని రూపొందిస్తున్నారు. 
 
సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో దూసుకెళ్తున్న ప్రెస్టీజియస్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ "రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తోంది. "రాజా సాబ్" సినిమా తమ సంస్థలో ఒక మెమొరబుల్ మూవీగా మిగిలిపోయేలా నిర్మిస్తోంది. 
 
"రాజా సాబ్" పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం "రాజా సాబ్" సినిమా రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది.
 
నటీనటులు - ప్రభాస్, తదితరులు
టెక్నికల్ టీమ్
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ - కార్తీక్ పళని
మ్యూజిక్ - తమన్
ఫైట్ మాస్టర్ - రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్
వీఎఎఫ్ఎక్స్ - ఆర్.సి. కమల్ కన్నన్
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కేఎన్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా, వంశీ కాకా
కో ప్రొడ్యూసర్ - వివేక్ కూచిభొట్ల
ప్రొడ్యూసర్ - టీజీ విశ్వప్రసాద్
రచన, దర్శకత్వం - మారుతి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments