Webdunia - Bharat's app for daily news and videos

Install App

గతిలేని స్థితిలో చిన్న సినిమా: దాసరి నారాయణరావు

''ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న సినిమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి గతిలేని పరిస్థితి కనిపిస్తోంది. నా తరఫున ఈ సినిమాను ప్రోత్సహించాలని ఈ కార్యక్రమానికి వచ్చానని'' సీనియర్‌ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. విజయ్‌ భరత్‌, అశ్విని, సత్యం రాజేష్‌, సంప

Webdunia
బుధవారం, 25 మే 2016 (19:48 IST)
''ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న సినిమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి గతిలేని పరిస్థితి కనిపిస్తోంది. నా తరఫున ఈ సినిమాను ప్రోత్సహించాలని ఈ కార్యక్రమానికి వచ్చానని'' సీనియర్‌ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. విజయ్‌ భరత్‌, అశ్విని, సత్యం రాజేష్‌, సంపూర్నేష్‌ బాబు, పృథ్వి ప్రధాన పాత్రల్లో నటించిన 'వినోదం 100%' చిత్ర ప్రమోషన్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ చిత్రానికి జై శ్రీరామ్‌ దర్శకుడు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాలో పృథ్వి, సత్యం రాజేష్‌, సంపూర్నేష్‌ బాబు ఇలా 100% వినోదాన్నిచ్చే ఆర్టిస్టులే ఉన్నారు. ఈ చిత్ర దర్శకుడు నా 'ధ్వని ప్రతిధ్వని' సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. ఖచ్చితంగా ఈ సినిమాను బాగా డైరెక్ట్‌ చేసే ఉంటాడు. రామదాసు ఈ సినిమాను రిలీజ్‌ చేసే బాధ్యత తన మీద వేసుకున్నాడు. ఈనెల 27న సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. టీం అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు.
 
రామదాసు మాట్లాడుతూ.. ఈ సినిమాను నేను చూశాను. బాగా వచ్చింది. ఖచ్చితంగా ఆడియన్స్‌ అందరూ ఎంటర్టైన్‌ అవుతారని చెప్పారు. నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ సినిమా కొంత భాగాన్ని విదేశాల్లో చిత్రీకరించాం. మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. దర్శకుడు జై శ్రీరాం మాట్లాడుతూ.. చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో రామదాసు గారు ఈ సినిమాను రిలీజ్‌ చేయడానికి ముందుకొచ్చారనీ, ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments