అభిమాని హత్య కేసు నిందితుడు ... జైలులో లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్న హీరో దర్శన్!!

ఠాగూర్
సోమవారం, 26 ఆగస్టు 2024 (11:11 IST)
తన అభిమానిని హత్య చేసిన కేసులో నిందితుడుగా ఉన్న కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఉంటున్నారు. ఇక్కడ ఆయనకు సకల సౌకర్యాలను జైలు అధికారులు సమకూర్చుతున్నారు. లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఆయన గార్డెన్‌లో కూర్చీలు వేసుకుని కూర్చొని, చేతిలో గ్లాసు, మరో చేతిలో సిగరెట్ పట్టుకుని దర్జాగా ఉన్నాడు. ఈ ఫోటోలను చూస్తే దర్శన్‌కు జైలు అధికారులు వీవీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. 
 
ప్రస్తుతం అయన పరప్పణ అగ్రహారంలోని ప్రత్యేక బ్యారక్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. జైలు కెళ్లిన తర్వాత దర్శన్ కుంగిపోయాడంటూ, అనారోగ్యానికి గురయ్యాడని వార్తలు కూడా వచ్చాయి. కానీ, అయితే అవన్నీ అవాస్తవాలేనని దర్శన్‌కు జైలులోనూ అన్ని సౌకర్యాలు అందుతున్నాయని తెలుస్తోంది. 
 
తాజాగా జైలులో దర్శన్ ఫోటో బయటకు వచ్చింది. అందులో కాఫీని తాగుతూ, చేతిలో సిగరెట్‌‌తో కనిపించాడు. దర్శన్ తన బ్యారక్ నుంచి బయటకు వచ్చి మరో ముగ్గురితో కూర్చుని కులసాగా కబుర్లు చెబుతూ ఉన్నాడు. దీనిని చూసిన నెటిజన్లు జైలులో దర్శన్‌కు ఇంకా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో అని జైలు అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.
 
దర్శన్ ది హై ప్రొఫైల్ కేసు కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. దర్శన్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే చాలా సాక్ష్యాలు లభించాయి. మరికొద్ది రోజుల్లోనే  పోలీసులు చార్జిషీటును సమర్పించనున్నారు. ఈ క్రమంలో దర్శన్ ఫోటో బయటకు రావడంతో ప్రతి ఒక్కరూ విస్తుపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

పెళ్లికి ముందు ప్రియుడితో గోవా హోటల్‌లో యువతి ఎంజాయ్.. ఇపుడు వీడియోలతో బ్లాక్‌మెయిల్

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నది పాత సామెత... ఇపుడు అంతా రివర్స్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments