Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఇంట దంగల్ ఫీవర్.. లిటిల్ రెజర్లంటూ సుస్మిత ట్వీట్.. ఖైదీ ఫంక్షన్‌కు పవన్ డుమ్మా

దేశవ్యాప్తంగా అమీర్ ఖాన్ ''దంగల్'' సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ టాప్ స్టార్ అమీర్ ఖాన్ నటనకు తోడు.. స్ఫూర్తినిచ్చే సినిమాగా నిలిచిన దంగల్ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపి

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (14:14 IST)
దేశవ్యాప్తంగా అమీర్ ఖాన్ ''దంగల్'' సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ టాప్ స్టార్ అమీర్ ఖాన్ నటనకు తోడు.. స్ఫూర్తినిచ్చే సినిమాగా నిలిచిన దంగల్ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో దంగల్ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి పెద్దకుమార్తె సుస్మితా కొణిదెల ట్వీట్ చేశారు.

అమీర్ ఖాన్‌తో పాటు దంగల్ అండ్ టీమ్ నిర్మించింది కేవలం సినిమాను మాత్రమే కాదని, స్ఫూర్తినిచ్చారని ట్వీట్ చేశారు. ఇప్పటికే రెండుసార్లు ఈ సినిమాను చూశామన్నారు. ఇంకా చెప్పాలంటే.. తమ ఇంట్లో దంగల్ ఫీవర్ పట్టుకుందని.. మా ఇంట్లో లిటిల్  రెజర్లు అంటూ తన ఇద్దరు కుమార్తెలు కుస్తీ పడుతున్న ఫోటోను సుస్మిత పోస్ట్ చేశారు.
 
ఇదిలా ఉంటే... సుస్మిత ఖైదీ సినిమా పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. సినిమా మొదలైనప్పటి నుంచి ఆ సినిమాకు సంబంధించిన పనులన్నీ నిర్మాత చెర్రీతో కలిసి చేస్తున్న సుస్మిత.. ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఫంక్షన్ పనుల్లో ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ గుంటూరులోని హాయ్ ల్యాండ్‌లో జరగనుంది. ఈ ఫంక్షన్ కు మెగా హీరోలంతా తరలిరానున్నారు. 
 
కానీ పవర్ స్టార్ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అనేది మెగా అభిమానుల్లో పెను సందేహంగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో, ఈ విషయంపై ప్రముఖ నిర్మాత, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. 'ఖైదీ' వేడుకకు పవన్ కల్యాణ్ హాజరు కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగానే పవన్ రావడం లేదని స్పష్టం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Free Bus: ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. చంద్రబాబు (video)

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

తర్వాతి కథనం
Show comments