Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా డాడీపై బయోపిక్ ఉండదు : దగ్గుబాటి సురేశ్ బాబు

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీయనున్నట్టు వచ్చిన వార్తలపై ఆయన తనయుడు, నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు స్పందించారు. తన తండ్రి రా

Webdunia
శనివారం, 23 జూన్ 2018 (10:37 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీయనున్నట్టు వచ్చిన వార్తలపై ఆయన తనయుడు, నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు స్పందించారు. తన తండ్రి రామానాయుడిపై బయోపిక్ తెరకెక్కించే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు.
 
ఆయన నిర్మాణ సారథ్యంలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందించిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా ఈ నెల 29న విడుదల కాబోతోంది. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, వెంకట్ కాకమాను, అభినవ్ గోమతం, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా సురేశ్ బాబు మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
తన తండ్రి రామానాయుడి బయోపిక్‌ను తెరకెక్కించాలనుకోవడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమన్నారు. 'మహానటి', 'సంజు' వంటి బయోపిక్స్‌కు దీనికి మధ్య చాలా తేడా ఉందన్నారు. వాళ్లు తమ జీవితాలలో పలు కోణాలను చవిచూశారన్నారు. తన తండ్రి జీవితం అలా కాదని, కథలో కాంట్రవర్సీ లేకపోతే ఎవరూ వినరు, చూడరని వివరించారు. ఇప్పటికైతే ఆయన బయోపిక్ తెరకెక్కించాలన్న ఆలోచన లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు నుంచి రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments