Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దాక్కో దాక్కో మేక' : పుష్ప నుంచి సింగిల్ సాంగ్ రిలీజ్

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (11:28 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో నుంచి తొలి సింగిల్ సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన లిరిక‌ల్ సాంగ్ వీడియో విడుద‌ల చేశారు. ఈ పాటను ఐదు భాషలలో ఐదుగురు ఫేమస్ సింగర్స్ పాడారు. హిందీలో ఈ పాట‌ను విశాల్ దద్లానీ, తెలుగులో శివం, కన్నడంలో విజయ్ ప్రకాశ్, మళయాలంలో రాహుల్ నంబియార్, త‌మిళంలో బెన్నీ ద‌యాల్ ఆల‌పించారు. 
 
దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సింగిల్ ట్యూన్‌కి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌స్తుంది. అయితే ఈ పాట‌లో బ‌న్నీ మాస్ లుక్, స్టెప్స్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ పాట కూడా మూవీపై అంచ‌నాలు భారీగానే పెంచింది.
 
కాగా, అల వైకుంఠ‌పురుమ‌లో వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బ‌న్నీ పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఆయ‌న భార్య పాత్ర‌లో ర‌ష్మిక కూడా డీ గ్లామ‌ర్‌గానే క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం.
 
ఫస్ట్ లుక్ పోస్టర్, పుష్పరాజ్ ఇంట్రడక్ష‌న్ వీడియో అంటూ మొదటి నుంచి ఈ సినిమా పై హైప్స్ క్రియేట్ చేస్తూ వస్తున్న మేకర్స్… ఇటీవల ఈ మూవీ నుంచి దాక్కో దాక్కో మేక ఫస్ట్ సాంగ్ త్వరలోనే రాబోతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఈ సాంగ్‌కి సంబంధించి కూడా ప‌లు వీడియోలు విడుద‌ల చేశారు. తాజాగా "దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక" అనే బీట్‌తో వ‌చ్చిన ఈ పాట‌లో బన్నీ నోటితో పెద్ద కత్తి పట్టుకొని సీరియస్ లుక్‏లో కనిపిస్తున్నాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్

Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

పెళ్లాం తన మాట వినడం లేదని పెళ్లి కుదిర్చిన వ్యక్తిని పొడిచి హత్య చేసిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments