Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాహో' దర్శకుడు సుజీత్‌కు లక్కీ ఛాన్స్.. పవన్ కళ్యాణ్ హీరోగా కొత్త చిత్రం

Webdunia
సోమవారం, 30 జనవరి 2023 (12:16 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలకు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే ఆయన "హరిహర వీరమల్లు" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తికాకముందే మరో చిత్రాన్ని ప్రారంభించారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానరుపై ప్రొడక్షన్ నెంబర్ 6గా నిర్మించే చిత్రంలో పవన్ హీరోగా నటిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి లోగడ ప్రభాస్ హీరోగా "సాహో" చిత్రానికి దర్శకత్వం వహించిన సుజిత్‌ను దర్శకుడిగా ఎంపిక చేశారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్ నగరంలో జరుగగా, ఇందుకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. 
 
అయితే, ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు, ప్రతినాయకుడు ఎవరు, చిత్రానికి పనిచేసే సాంకేతిక నిపుణులు, రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది ఇత్యాది విషయాలపై ఓ క్లారిటీ రావాల్సివుంది. "సాహో" సినిమా తర్వాత దర్శకుడు సుజిత్ మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు. చాలా గ్యాప్ తర్వాత భారీ ప్రాజెక్టునే భుజాలకు ఎత్తుకున్నారు. 
 
కాగా, డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ గతంలో అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించింది. తాజాగా "ఆర్ఆర్ఆర్" చిత్రాన్ని కూడా ఈ సంస్థే నిర్మించింది. ఇపుడు పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్‌తో తొలి చిత్రానికి శ్రీకారం చుట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments