Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి కోలుకున్నా... ఇపుడు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాను : తమన్నా

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (10:50 IST)
తాను కరోనా వైరస్ బారినపడి పూర్తికా కోలుకున్నట్టు టాలీవుడ్ తెల్లపిల్ల తమన్నా భాటియా వెల్లడించారు. అయితే, వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 
 
నిజానికి ఎన్నో జాగ్రత్తల మధ్య తమన్నా ఓ వెబ్ సిరీస్‌ షూటింగ్‌లో పాల్గొంది. అక్కడ ఆమెకు కరోనా వైరస్ సోకింది. జ్వ‌రం వ‌స్తుండ‌డంతో టెస్ట్ చేయించుకున్న ఆమెకు క‌రోనా పాజిటివ్‌ అని తేలింది. అయితే ప్ర‌స్తుతం  తాను కరోనా నుండి కోలుకున్న విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ లేఖని విడుద‌ల చేసింది. 
 
"నేను నా టీం సెట్‌లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. కాని ఎలా సోకిందో అర్థం కావ‌డం లేదు. గ‌త వారం లైట్ ఫీవ‌ర్ ఉండ‌డంతో క‌రోనా టెస్ట్ చేయించుకోగా, పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. ఈ స‌మస్య నుండి బ‌య‌ట ప‌డేందుకు హైద‌రాబాద్‌లోని ప్రైవేట్ ఆసుప‌త్రిలో వెంట‌నే అడ్మిట్ అయి చికిత్స తీసుకున్నాను. నిపుణులైన వైద్యుల సంరక్షణలో ట్రీట్‌మెంట్‌ అనంతరం.. డాక్టర్ల సలహాతో నేనిప్పుడు డిశ్చార్జ్ అయ్యాను. 
 
ప్ర‌పంచాన్ని వణికిస్తున్న క‌రోనా మ‌హమ్మారి నుండి త్వ‌ర‌గా కోలుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. పూర్తి ఆరోగ్యంతో త్వ‌ర‌లోనే మీ ముందుకు వ‌స్తాను. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. నాకోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండండి" అంటూ తమన్నా తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసిన లేఖలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments