Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌లో వచ్చే జూలై నెల నాటికి 25 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్: హర్షవర్ధన్

భారత్‌లో వచ్చే జూలై నెల నాటికి 25 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్: హర్షవర్ధన్
, సోమవారం, 5 అక్టోబరు 2020 (12:21 IST)
భారత్‌లో జూలై 2021 నాటికి దేశంలోని 130 కోట్ల మందిలో 25 కోట్ల మంది ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఈ ప్రయోజనం కోసం ప్రభుత్వం 400 నుండి 500 మిలియన్ల వ్యాక్సిన్ మోతాదులను సేకరిస్తుందని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.
 
ఆ వ్యాక్సిన్‌ను మొదటగా ఎవరికి ఇవ్వాలనే వివరాలను పంపాలని రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రభుత్వాలకు సూచించామని ఆరోగ్య మంత్రి చెప్పారు. అయితే ప్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తలకు (ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులు) టీకాను స్వీకరించడానికి మొదటి స్థానంలో ఉంటారని ఆయన అన్నారు. భారతీయ వ్యాక్సిన్ తయారీదార్లకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని టీకాకు సమానమైన ప్రాప్యతను నిర్ధారించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
 
ప్రపంచంలో అనేక వ్యాక్సిన్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని త్వరలో శుభవార్త వింటామని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే భారత్‌లో కూడా ప్రస్తుతం దేశంలో మూడు వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకాతో కలిసి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేసిన కోవిషీల్డ్ రెండు, మూడో దశ ట్రయల్స్‌లో ఉంది.
 
ఈ టీకాపై బ్రిటన్‌లో కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం 2020 చివరి నాటికి బ్రిటన్‌లో ఈ టీకాకు అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయి. దాంతో వచ్చే ఆరు నెలల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భారత ప్రభుత్వం భావిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎదురింటి కుర్రోడిని పెళ్లాడిన భార్య... ఫేస్‌బుక్ లైవ్‌లో భర్త ఏం చేశాడంటే...