Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపరిచితులుగా కలిసిన ప్రేమికులుగా మారిన కాన్సెప్ట్ తో కపుల్ ఫ్రెండ్లీ

దేవీ
శనివారం, 9 ఆగస్టు 2025 (10:46 IST)
Santosh Shobhan, Manasa Varanasi
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ గా "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా తెరకెక్కుతోంది.  త్వరలో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎలా ఉందో చూస్తే - 'నెల్లూరుకు చెందిన యువకుడు శివ (సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైనింగ్ చేసి సరైన ఉద్యోగం లేక చెన్నై నగరంలో ఇబ్బందులు పడుతుంటాడు. ఖర్చుల కోసం బైక్ పూలింగ్ చేస్తుంటాడు. ప్రీతి (మానస వారణాసి) శివ బైక్ పై జర్నీ చేస్తుంది. అపరిచితులుగా కలిసిన శివ, ప్రీతి ప్రేమికులుగా మారడం, సన్నిహితంగా ఉన్న వారి ప్రేమ సన్నివేశాలను చూపిస్తూ టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఈ టీజర్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రవీంద్రన్ కంపోజ్ చేసిన ' స్పార్క్స్ ఇన్ యువర్ ఐస్, దే షైన్..' అంటూ సాగే బిట్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ' ఒకప్పటి సాధారణ క్షణాలన్నీ జ్ఞాపకాలుగా మారడమే జీవితం..' అంటూ టీజర్ చివరలో వేసిన క్యాప్షన్ "కపుల్ ఫ్రెండ్లీ" బ్యాక్ డ్రాప్ ను రిఫ్లెక్ట్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాఠశాలలకు రూ.45.02 కోట్లు మంజూరు

ప్రైవేట్ బస్సులో నేపాలీ మహిళపై అత్యాచారం... ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments