Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానటి సినిమాకి కౌంటర్ రాబోతోంది..!

అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా మ‌హాన‌టి సినిమా తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. తెలుగు, త‌మిళ్‌లో రూపొందిన ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్‌లో సైతం రికార్డ్ స్థాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తోంది. తాజాగా మరో బ

Webdunia
మంగళవారం, 22 మే 2018 (11:59 IST)
అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా మ‌హాన‌టి సినిమా తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. తెలుగు, త‌మిళ్‌లో రూపొందిన ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్‌లో సైతం రికార్డ్ స్థాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తోంది. తాజాగా మరో బయోపిక్‌ తెరమీదకు రానుంది. అయితే... ఆ బయోపిక్‌ మహానటికి కౌంటర్‌గా తెరకెక్కుతుండటం విశేషం. 
 
మహానటి సినిమాలో జెమినీ గణేషన్‌ పాత్రను తప్పుగా చూపించారని ఆయన కూతురు డాక్టర్‌ కమల ఆరోపిస్తున్నారు. తన తండ్రి అవకాశాలు రాక సావిత్రిని వేధించినట్టుగా తాగుబోతుగా చూపించారనీ, అది నిజం కాదని ఆమె వాదిస్తున్నారు. అంతేకాదు త్వరలో జెమినీ గణేషన్ కథతో ఓ డాక్యుమెంటరినీ రూపొందిస్తున్నట్టుగా కమల వెల్లడించారు. 
 
మహానటి వివాదం తెరమీదకు వచ్చిన తరువాత జర్నలిస్ట్‌ అనుపమా సుబ్రమణియంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మహానటిలో కేవలం ఒకవైపు నుంచి మాత్రమే చూపించారని అందుకే తన తండ్రి అసలు ఎలాంటివారో ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నట్టుగా తెలిపారు. గంటా నలభై నిమిషాల నిడివితో రూపొందించే ఈ డాక్యుమెంటరీని చెన్నైతో పాటు హైదరబాద్‌లోనూ మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శిస్తామని తెలియ‌చేసారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments