Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరిలో పవన్ హీరోయిన్ మీరా చోప్రా వివాహం..

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (09:56 IST)
meera chopra
హీరోయిన్ మీరా చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం ఈ భామ. 40 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమైన ఈ బ్యూటీ.. ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి చెప్పింది మీరా చోప్రా. ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే… మీరా చోప్రా ఎక్కువ కాలం హీరోయిన్‌గా నిలవలేక పోయినా తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం మీరా చోప్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందాలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. నలభై ఏళ్లు దాటినా మీరా చోప్రా ఇంకా పెళ్లి చేసుకోలేదు.
 
అయితే ఎట్టకేలకు మీరా చోప్రా తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. మీరా చోప్రా ప్రస్తుతం బాలీవుడ్‌లో సఫెద్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీరా చోప్రా.. తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.
 
“అవును నిజమే.. నేను పెళ్లి చేసుకుంటున్నాను.. 2024 ఫిబ్రవరి నెలాఖరున ఇంటిమేట్ పెళ్లి జరగనుంది, అందుకు సంబంధించిన సన్నాహాల్లో నా కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు. అంతా మా కుటుంబీకులే నిర్వహిస్తున్నారు.. ఈ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాజస్థాన్‌లో కేవలం 150 మంది అతిథులు మాత్రమే ఉన్నారు" అని మీరా చెప్పారు.
 
మీరా స్నేహితులు, సినీ ప్రేక్షకుల కోసం ముంబైలో తర్వాత చిన్న రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. అయితే కాబోయే భర్త వివరాలు ఇంకా తెలియరాలేదు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments