Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 6 March 2025
webdunia

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : నాలుగో జట్టుగా అర్హత సాధించిన కివీస్.. భారత్‌తో పోరు...

Advertiesment
ind vs nz
, ఆదివారం, 12 నవంబరు 2023 (09:33 IST)
భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. పది జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఈ టోర్నీలో చివరి లీగ్ మ్యాచ్ భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య ఆదివారం జరుగనుంది. ఆ తర్వాత సెమీస్ పోటీలు ప్రారంభంకానున్నాయి. ఈ నాకౌట్ పోటీలకు నాలుగు జట్లు అర్హత సాధించాయి. వీటిలో భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. ఈ సెమీస్ పోటీల్లో తలపడే జట్లు కూడా ఖరారైపోయాయి. తొలి సెమీస్ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ నెల 15వ తేదీన జరుగనుంది. 
 
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్, నాలుగో స్థానంలో నిలిచిన కివీస్‌తోనూ, పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల రెండు సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. అయితే, శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో అతి భారీ విజయం సాధిస్తే పాకిస్థాన్ సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. చివరకు ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిర్ధేశించిన 338 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. 43.3 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ఈ టోర్నీ పూర్తికముందే పాక్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాకిస్థాన్ ఓడిపోవడంతో న్యూజిలాండ్ సెమీస్ స్థానం ఖరారైంది.
 
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ ఖాతాలో 16, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఖాతాల్లో 14, న్యూజిలాండ్ ఖాతాలో 10 చొప్పున పాయింట్లు ఉన్నాయి. ఇపుడు పాక్ నిష్క్రమణ నేపథ్యంలో కివీస్ నాలుగు జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించింది. న్యూజిలాండ్ జట్టు 9 మ్యాచ్‌లు ఆడి ఐదు మ్యాచ్‌లలో గెలుపొంది, 10 పాయింట్లను సొంతం చేసుకుంది. 
 
దీంతో ఈ నెల 15వ తేదీన ముంబై వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభంకానుంది. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ఈ నెల 16వ తేదీన జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. దీంతో 2023 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ మెగా ఈవెంట్ ముగుస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్ ఓడింది.. భారత్ సెమీస్ పోరు ఎవరితోనో ఖాయమైంది..!