Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో కంప్యూటర్‌ స్క్రీన్‌ మూవీ `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు`

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (16:33 IST)
WWW still
‘118’ చిత్రాన్ని తీసిన ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్నలేటెస్ట్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‌'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యుస‌ (ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ భాగ‌స్వామ్యంతో థియేట‌ర్స్‌లో గ్రాండ్‌గా విడుద‌ల‌కానుంది. అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నఈ మూవీ నుండి ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన అన్ని సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకుని సినిమాపై అంఛనాల్ని భారీగా పెంచాయి.  
 
ఈ సంద‌ర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ, సినిమా చూశాను. ఆక‌ట్టుకునే క‌థ‌తో మంచి పెర్‌ఫామెన్స్‌ల‌తో చాలా థ్రిల్లింగ్ గా తెర‌కెక్కించారు. ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిస్థితుల్ని, ఈ క‌రోనా వ‌ల్ల వర్చువల్ వరల్డ్ లో వ‌చ్చిన మార్పుల‌ని చ‌క్క‌గా చూపించారు. అంత‌ర్లీనంగా  ఒక మంచి ప్రేమ‌క‌థ కూడా ఉంది. ఆడియోకి ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు వంటి ఒక మంచి చిత్రాన్ని మీకు థియేటర్లలో అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది``అన్నారు. 
 
చిత్ర నిర్మాత డా. రవి పి. రాజు దాట్ల మాట్లాడుతూ, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌కులుగా వ్యవ‌హరించ‌డం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్‌ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్‌ స్క్రీన్‌ మూవీ ఇది. గుహ‌న్‌గారి మేకింగ్ చాలా కొత్త‌గా ఉంటుంది. అలాగే అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్ ఇద్ద‌రు సెటిల్డ్ పెర్‌ఫామెన్స్ ఇచ్చారు. వారిద్ద‌రి కెమిస్ట్రి త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. త్వ‌రలో ట్రైల‌ర్ రిలీజ్ చేయనున్నాం. క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది అన్నారు.
 
చిత్ర ద‌ర్శ‌కుడు కేవీ గుహన్ మాట్లాడుతూ,`సినిమా చాలా బాగా వ‌చ్చింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ మూవీ విడుద‌ల‌వ‌డం నిజంగా హ్యీపీగా ఉంది. అదిత్‌, శివాణి ఇద్ద‌రు చాలా బాగా న‌టించారు. టెక్నీషియ‌న్స్ అంద‌రూ మంచి స‌పొర్ట్ అందించారు. తప్పకుండా ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది`` అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments