Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

దేవీ
గురువారం, 11 సెప్టెంబరు 2025 (18:18 IST)
Mirai -Teja Sajja
హనుమాన్ కి ఇప్పటికి నాలో మార్పు లేదు. సినిమాకి పడే కష్టంలో ఎలాంటి తేడా లేదు. ఇంతకుముందు ఎలాగైతే కొత్తరకం సినిమాలు చేయాలని అనుకున్నానో ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. హనుమాన్ కి ఎంత ఎఫర్ట్ పెట్టానో దాని కంటే ఎక్కువ మిరాయ్ కి పెట్టాను అని తేజ సజ్జా తెలిపారు.
 
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా హీరో తేజ సజ్జా సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
- హనుమాన్ తర్వాత వస్తున్న మిరాయ్ విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదు. నిజానికి హనుమాన్ విషయంలోనే చాలా ఒత్తిడి వుండేది. నేను సక్సెస్ ని ఆపాదించుకోను. ఒక సినిమాకి మించి ఇంకో సినిమా చేయాలనే అంచనాలు ఏమీ ఉండవు. ఏ సినిమాకి ఆ సినిమానే ప్రత్యేకము. ఒక సినిమాకి 100% ఎఫర్ట్ పెడుతున్నానా లేదా చూసుకుంటాను. ఒక్క గొప్ప వర్క్ చేయాలనే ఒత్తిడి తప్పితే హనుమాన్ వల్ల వచ్చిన ఒత్తిడి ఏమీ లేదు.
 
- నా మెయిన్ గ్రౌండ్ తెలుగు ఆడియన్స్. మనకోసం తీసిన సినిమా ఇది. ఇతర భాషల్లో ఆడితే ఆనందం. నేను మాత్రం తెలుగు ప్రేక్షకుల కోసమే సినిమాలు చేస్తాను.
 
-ఒక మామూలు కుర్రాడు తన ధర్మాన్ని తెలుసుకొని, తనకి యోధులు కి ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని, ఒక పెద్ద ఆపదని ఆపడానికి తను ఎంత దూరం వెళ్తాడు? తన తల్లి ఆశయం కోసం ఎంత దూరం వెళ్తాడు? ఇతిహాసాల్లో ఉన్న సమాధానం కోసం జర్నీ చేసే క్యారెక్టర్ లో కనిపిస్తాను.
 
- ఇందులో ఛాలెంజింగ్ మొత్తం దాదాపు 9 యాక్షన్ బ్లాక్ ఉన్నాయి. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ దేనికదే చాలెంజ్. ఎన్ని రిస్కులు ఛాలెంజ్లో తీసుకున్న సరే.. ఆడియన్స్ రిలీజ్ రోజు ఎంత థ్రిల్ అవుతారు...అదొక్కటే గుర్తొస్తుంటుంది.
 
-శ్రియ గారు జగపతిబాబు గారితో నేను చిన్నప్పుడు కలిసి నటించాను. వాళ్ళందరితో మళ్ళీ ఇప్పుడు కలిసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. జయరాం గారు చాలా పెద్ద నటులు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి ఏమీ లేదు. అయినప్పటికీ ఈ సినిమా మీద పాషన్ తో చాలా బిజీగా ఉన్నప్పటికీ మేమంతా కష్టపడుతుంటే వాళ్ళు అంత కష్టపడ్డారు. మాతో పాటు హిమాలయాలు నేపాల్ శ్రీలంక తో పాటు మైనస్ 80 డిగ్రీలలో కూడా వర్క్ చేశారు. మా సినిమా కోసం అంత హార్డ్ వర్క్ చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
 
- మనోజ్ చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఒక జీవితాన్ని చూసి వచ్చిన పాత్ర. ఆ పాత్రకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఒక పెద్ద డేంజర్ క్రియేట్ చేయగల క్యారెక్టర్. హీరో ఎలా ఎదుర్కోగలడు అనిపించేలా ఉండే క్యారెక్టర్. అలాంటి గొప్ప క్యారెక్టర్ కోసం మనోజ్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. కథ, క్యారెక్టర్ చాలా ఎక్సైట్ అయ్యారు.
 
- మ్యూజిక్ గా చెప్పాలంటే.. హరి గౌర లాంటి డెడికేషన్ ఉన్న టెక్నీషియన్ దొరకడం చాలా చాలా ఆనందం. ఈ సినిమాకి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. మా జర్నీ మున్ముందు కూడా కొనసాగుతుంది.
 
- ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్.. చిరంజీవి గారు ఒక పెద్ద మెసేజ్ పెట్టడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలాగే నాని అన్న కూడా ఒక మంచి మెసేజ్ పెట్టారు. చాలామంది దర్శకులు ఎన్నో మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు.
 
-కరణ్ జోహార్ గారు ఈ సినిమా చూసి ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేను. మీలాంటి ఫిలిం మేకర్స్ బయటికి రావాలి మీకు పెద్ద ప్లాట్ఫారం ఇస్తానని ప్రమోషన్స్ కి ఎంత దూరమైనా వస్తానని ఆయన చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
 
- మిరాయ్ లో శ్రీరాముల వారి నేపథ్యం గురించి చెప్పాలంటే... మన ఇతిహాసాలతో చాలా ఆర్గానిక్ గా బ్లెండ్ అయిన కథ ఇది. బలవంతంగా ఇరికించింది కాదు. అది చిన్న పోర్షన్ ఉన్నప్పటికీ, వచ్చినప్పుడు స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఈ సినిమాలో రెండు సర్ ప్రైజ్ లు ఉన్నాయి. ఆడియన్స్ రేపు చూడబోతున్నారు.
 
- మిరాయ్ 2 సినిమా హిట్ అయితే కచ్చితంగా మిరాయ్ ఫ్రాంచెస్ అయ్యే పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్టు. ప్రేక్షకులు ఆదరిస్తే ఖచ్చితంగా పార్ట్ 2 వస్తుంది.
 
కొత్తగా చేయబోతున్న సినిమాలు?
-నేను ఒక సినిమా కమిట్ అయితే అది పూర్తయి రిలీజ్ అయినంత వరకు దానిపైనే ఉంటాను. అందుకే ప్యుచర్ సినిమాలు గురించి ఆలోచించే అంత స్పేస్ ఉండటం లేదు. ఆడియన్స్ లో క్రెడిబిలిటీ సంపాదించడం పైనే నా దృష్టి ఉంటుంది. సినిమా రిలీజ్ సమయంలో ఆడియన్స్ ని థియేటర్స్ పిలిచేటప్పుడు ముందు నేను కాన్ఫిడెంట్ గా ఉండాలి.
-ప్రస్తుతానికి 'జాంబిరెడ్డి 2' ఒక్కటే కమిట్ అయ్యాను. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైద్య విద్యార్థినిలు దుస్తులు మార్చుకుంటుండగా వీడియో తీసిన మేల్ నర్స్

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments