Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం నేనెవరు : డా: రాజేంద్ర ప్రసాద్

Advertiesment
Dr. Rajendra Prasad, director Chiranjeevi, Teegala Krishna Reddy

దేవీ

, గురువారం, 11 సెప్టెంబరు 2025 (17:19 IST)
Dr. Rajendra Prasad, director Chiranjeevi, Teegala Krishna Reddy
నేను నటించిన మంచి సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయే చిత్రం నేనెవరు?. దర్శకుడు చిరంజీవి ఈ కథ నాకు చెప్పినప్పుడు లిటరల్ గా షాక్ అయ్యాను. ఇంత గొప్ప కథను కరెక్ట్ గా తెరకెక్కించగలడా అని సందేహపడ్డాను కూడా. కానీ షూటింగ్ కి వెళ్ళాక కానీ... అతను ఎంత జీనియస్ అన్నది అర్ధం కాలేదు. నిర్మాతలు కూడా ఎంతో తపన, నిబద్ధత కలిగిన వ్యక్తులు. వాళ్ళకు "నేనెవరు?" చిత్రంతో ఘన విజయం సొంతం కావాలి" అన్నారు.
 
ఇటీవల కాలంలో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నటకిరీటి డా: రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్ర పోషించిన చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, దసరా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆడియో, టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ మాజీ మేయర్ - మాజీ శాసనసభ్యులు - ప్రముఖ విద్యావేత్త తీగల కృష్ణారెడ్డి, ప్రముఖ దర్శకులు వి.సముద్ర ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుకలో రాజేంద్రప్రసాద్ పాల్గొని, ఈ చిత్రంలో నటించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసి, దర్శకుడిగా చిరంజీవికి ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. 
 
సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రల్లో చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో సందేశభరిత వినోదాత్మకంగా  చిత్రం జై చిరంజీవ మూవీ మేకర్స్ పతాకంపై సరికొండ మల్లిఖార్జున్ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు - సకినాన భూలక్ష్మి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంతో వైజాగ్ సత్యానంద్ శిష్యులు అభిలాష్, సాయిచెర్రి హీరోలుగా పరిచయమవుతున్నారు. దీపిక - సోనాక్షి జబర్దస్త్ రాజమౌళి ఇతర పాత్రలు పోషించారు. రాజేంద్రప్రసాద్ వంటి లెజెండరీ ఆర్టిస్టుతో "నేనెవరు?" చిత్రం రూపొందించే అవకాశం లభించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని దర్శకనిర్మాతలు అన్నారు. దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇంత గొప్ప చిత్రంలో పార్ట్ అవ్వడం గర్వంగా ఉందని నటీనటులు, యూనిట్ సభ్యులు అన్నారు.
 
ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్ - అప్పాజీ, మాటలు: శ్రీనివాస్, పాటలు: ఎస్.ఎస్.వీరు, మ్యూజిక్: చిన్నికృష్ణ, ఎడిటర్: నందమూరి హరి - తారకరామారావు, సినిమాటోగ్రఫీ: నాయుడు ప్రసాద్ కొల్లి, సమర్పణ: సరికొండ మల్లిఖార్జున్, నిర్మాతలు: అండేకర్ జగదీష్ బాబు - సకినాన భూలక్ష్మి, రచన - దర్శకత్వం: చిరంజీవి తన్నీరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Rasi kanna: శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నాలతో లవ్ యు2 అంటున్న సిద్ధు జొన్నలగడ్డ