Webdunia - Bharat's app for daily news and videos

Install App

యావత్ కన్నడ చిత్ర పరిశ్రమను అవమానించింది... సంజనపై చర్య తీసుకోవాల్సిందే!

ప్రభాస్ హీరోగా నటించిన 'బుజ్జిగాడు' సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించిన కన్నడ భామ సంజన చిక్కుల్లో పడింది. తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేస్తున్న సంజనా గల్రానీ.. ఎక్కువగా శాండల్‌వుడ్ సినిమాలనే చేస

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (17:47 IST)
ప్రభాస్ హీరోగా నటించిన 'బుజ్జిగాడు' సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించిన కన్నడ భామ సంజన చిక్కుల్లో పడింది. తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేస్తున్న సంజనా గల్రానీ.. ఎక్కువగా శాండల్‌వుడ్ సినిమాలనే చేస్తోంది. రీసెంట్‌గా కన్నడలో ప్రసారమమవుతున్న బిగ్ బాస్ టీవీ షో కోసం ఓ వీడియో బైట్ ఇచ్చింది ఈ భామ. కేఎఫ్సీసీ సభ్యులు.. బిగ్ బాస్ షోని వ్యతిరేకించడంపై కామెంట్ చేయాలంటూ ఆమెపై ఒత్తిడి చేసిన సందర్భంలో కన్నడ చిత్రాలను 'డబ్బా' (వేస్ట్) చిత్రాలంటూ కామెంట్ చేసి కన్నడ చిత్ర రంగాన్ని అవమానించిందని ఆరోపిస్తూ కొందరు నిర్మాతలు ఆమెపై కన్నడ ఫిలించాంబర్‌కు ఫిర్యాదు చేశారు. 
 
కన్నడ సినిమాల పట్ల తృణీకార భావాన్ని కలిగి వున్న సంజన మొత్తం కన్నడ సినిమాను అవమానించిందని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కన్నడ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు కంప్లెయింట్ చేయడం.. హాజరు కావాలంటూ ఆమెకు సమన్ జారీ చేయడం కూడా జరిగిపోయింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఆమెను ఫిలిం చాంబర్‌కు పిలిచినా వెళ్లలేదట. పరిస్థితి చేజారుతోందని గ్రహించిన సంజన.. తాను కన్నడ ఇండస్ట్రీని అవమానించలేదని.. ఆ ఛానల్ వాళ్లు సెన్సేషనలిజం కోసం తన బైట్‌ను ముక్కలు ముక్కలుగా కట్ చేసి.. తన ఉద్దేశాన్ని నాశనం చేశారని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు.. తను ఎవరినైనా బాధ పెట్టివుంటే.. వాళ్లందరికీ ఓ సారీ కూడా చెప్పేయడంతో.. ఈ వివాదం ఒక కొలిక్కివచ్చిందనే  చెప్పాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments