Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పదవుల్లోనే కాదు.. న్యాయ విభాగంలోనూ... సీఎం జగన్‌కు ఏమైంది?

Webdunia
సోమవారం, 8 జులై 2019 (16:10 IST)
ఇటీవల మంత్రిపదవుల కేటాయింపుల్లో సామాజిక న్యాయం పాటించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి.. ఇపుడు న్యాయ విభాగంలోనూ సామాజిక  సూత్రం పాటిస్తున్నారు. గడచిన ఎన్నికల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన వై.యస్‌.జగన్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా సంచలన నిర్ణయాలతో ఆ వర్గాలకు పదవులు కట్టబెట్టారు. ఏకంగా ఐదుగుర్ని డిప్యూటీ సీఎంలు చేయడంతోపాటు, మంత్రివర్గంలోనూ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 60శాతానికిపైగా పదవులు కట్టబెట్టి చరిత్ర సృష్టించారు. 
 
ఇప్పుడు ఇదే ఫార్ములా ప్రభుత్వంలోని మిగతా విభాగాలు కూడా అమలు చేస్తున్నాయి. న్యాయవిభాగంలో కూడా ప్రభుత్వ నియామకాల్లో ఇదే సూత్రం అమలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ నియమించిన 17 మంది జీపీల్లో కూడా ముఖ్యమంత్రి వై.యస్‌.జగన్‌ సామాజిక సూత్రాన్ని పాటించారు. 
 
ఇద్దరు ఎస్సీలను, ఒక ఎస్టీని, ఒక ముస్లింని, నలుగురు బీసీలను ప్రభుత్వ ప్లీడర్లగా నియమించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి 4, కాపులకు 2, బ్రాహ్మణులకు 2 చొప్పున జీపీలుగా నియమితులయ్యారు. మిగిలి ఉన్న 5 పోస్టుల భర్తీలో సీఎం నిర్దేశించిన సామాజిక సూత్రాన్ని పాటిస్తామని అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్ వెల్లడించారు. స్టాండింగ్‌ కౌన్సిల్, ఏజీపీల నియామకాల్లోనూ ఇదే పద్దతిని పాటిస్తామన్నారు. 50 శాతం పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొరుగు గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులతో ప్రేమ... ఇద్దరినీ పెళ్లాడిన యువకుడు!

నరకం చూపిస్తా నాయాలా? టెక్కలిలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తాను : దువ్వాడ శ్రీనివాస్ చిందులు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments