Webdunia - Bharat's app for daily news and videos

Install App

చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 తెలుగులో గ్రాండ్ రిలీజ్

డీవీ
బుధవారం, 22 జనవరి 2025 (20:10 IST)
Veera Dheera Sooran
సక్సెస్ ఫుల్ డైరెక్టర్  ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ వంటి అద్భుతమైన నటులు ఉన్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రానికి తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జి.కె. ప్రసన్న ఎడిటింగ్ వర్క్ పర్యవేక్షిస్తున్నారు సి.ఎస్. బాలచందర్ ఆర్ట్ డైరెక్టర్.
 
H.R. పిక్చర్స్ రియా శిబు నిర్మించిన 'వీర ధీర సూరన్ పార్ట్ 2' ఒక యాక్షన్ థ్రిల్లర్, ఇది ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ సినిమాటిక్ ఎక్స్  పీరియన్స్ ఇస్తుంది.  
 
సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయినందున, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ విడుదలైనప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింతపెరుగుతున్నాయి,  ఇవన్నీ మిలియన్ల వ్యూస్ మైలురాయిని చేరుకున్నాయి. ఇప్పుడు, ఈ చిత్రం మార్చి 27, 2025న తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. తెలుగులో ఎన్విఆర్ సినిమాస్ ద్వారా ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.  
 
చియాన్ విక్రమ్-దర్శకుడు S.U. అరుణ్ కుమార్-నిర్మాత రియా శిబుల అద్భుతమైన అద్భుతమైన కొలాబరేషన్ లో వస్తున్న వీర ధీర సూరన్ పార్ట్ 2 పై ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకులలో చాలా అంచనాలు వున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jalgaon Train Accident: జల్గావ్ జిల్లా ఘోర రైలు ప్రమాదం.. 20మంది మృతి

అమ్మా... అత్తయ్య నాపై అత్యాచారం చేసింది: తల్లి వద్ద విలపించిన బాలుడు

Mahakumbh 2025: ప్రయాగ్ రాజ్‌లో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్.. ఇది ఏం చేస్తుందో తెలుసా?

మావోయిస్టు అగ్రనేత చలపతి ప్రాణాలు తీసిన సెల్ఫీ.. ఎలా?

అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ.11,000 కోట్లు - హడ్కో ఆమోదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments